కాకినాడ ‘పీఆర్’లో జాతీయస్థాయి సదస్సు
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:52 AM
కాకినాడ రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీకళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్ బీవీ తిరుపాణ్యం అధ్యక్షతన కళాశాల తెలుగు,హిందీ వి భాగాధిపతి డాక్టర్ పి.హరిరామ్‌ప్రసాద్ ఆధ్వ ర్యంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించా
కాకినాడ రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీకళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్ బీవీ తిరుపాణ్యం అధ్యక్షతన కళాశాల తెలుగు,హిందీ వి భాగాధిపతి డాక్టర్ పి.హరిరామ్‌ప్రసాద్ ఆధ్వ ర్యంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. గౌరవ అతిథులుగా ఆంధ్ర విశ్వవిద్యాల య ప్రొఫెసర్ పి.ప్రేమానందం, మౌలానా ఆజా ద్ ఉర్దూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జీవీ రత్నాకర్ విశిష్ట అతిథులుగా.. సినీ సంగీత దర్శకులు సాలూరు వాసూరావు, గురజాడ అప్పారావు ముని మనవడు డాక్టర్ మోపిదేవి విజయగోపా ల్ పాల్గొనగా డాక్టర్ నల్ల పవన్‌కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి పెంపొందుతుందన్నారు. ఏఎన్ యూ పూర్వపు రెక్టార్ ప్రొఫెసర్ వరప్రసాదమూర్తి అభ్యుదయ సాహిత్యంపై ప్రసంగించా రు. అనంతరం అతిథులు డాక్టర్ పి.హరిరామ్‌ప్రసాద్ రచించిన హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం తెలుగు, హిందీ వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధక విద్యార్థులు, కళాశాల విద్యార్థులు తెలుగు, హిందీ భాషల్లో తమ పరిశోధక పత్రాలను సమర్పించారు.
Updated Date - Dec 17 , 2024 | 12:52 AM