‘పటిష్ట నిఘాతో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి’
ABN , Publish Date - Apr 10 , 2024 | 12:25 AM
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు రవాణాకు అడ్డుకట్టవేసేందుకు పటిష్ట నిఘాతో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అఽధికారి, ఆర్డీవో ఇట్ల కిషోర్ ఆదేశించారు. మంగళవారం సర్పవరం జంక్షన్‌లో తహశీల్దార్ కార్యాలయంలో

సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు రవాణాకు అడ్డుకట్టవేసేందుకు పటిష్ట నిఘాతో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఇట్ల కిషోర్ ఆదేశించారు. మంగళవారం సర్పవరం జంక్షన్‌లో తహశీల్దార్ కార్యాలయంలో ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకు ండా చేసేందుకు వీలుగా నగదు, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేలా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా పనిచేసేలా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంద న్నారు. సమావేశంలో తహశీల్దార్ బి.విజయప్రసాద్, ఎన్నికల డీటీ సురేష్ తదితరులున్నారు.