ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుపరిపాలన అందించేందుకు పని చేద్దాం

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:42 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చి, సుపరిపాలన అందించేందుకు సమష్టిగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పని చేద్దామంటూ కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఎన్‌ఎఫ్‌

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నానాజీ

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం జంక్షన్‌, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చి, సుపరిపాలన అందించేందుకు సమష్టిగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పని చేద్దామంటూ కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులో గల కాపు కల్యాణ మండపంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలు అమలు, సిబ్బంది పని తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది అందిస్తున్న సేవలు, విధులను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్‌, తాగునీరు సరఫరాపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్‌ డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల పండూరు -1,2 లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం లో జాబ్‌కార్డు కూలీలకు నూటికి నూరుశాతం పని దినాలు పెంచి, అధికంగా నిధులు రాబట్టేలా కృషి చేయాలన్నారు. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో అధిక శాతం మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని, వారిని గుర్తించి ఈనెల 6లోపు ఓటర్లు చేర్పించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో పసుపులేటి శ్రీ నివాస్‌, తహశీల్దార్‌ వీఎల్‌ఎన్‌.కుమారి, ఈవోపీఆర్‌డీ ఎంఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఇంజనీరింగ్‌ అధికారి వాసుదేవరావు, ఎంఈవో వేణుగోపాలరావు, రమణయ్యపేట పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:42 AM