ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:08 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళులు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం సర్పవరం కార్మికుల సంఘం భవనంలో తదేకం ఫౌండేషన్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ యార్లగడ్డ సు ధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన స

మహిళలకు సర్టిఫికెట్లు అందించిన ఎమ్మెల్యే పంతం నానాజీ, యార్లగడ్డ సుధారాణి

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం జంక్షన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళులు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం సర్పవరం కార్మికుల సంఘం భవనంలో తదేకం ఫౌండేషన్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ యార్లగడ్డ సు ధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళల స్వయం సంమృద్ధి, జీవనోపాధి కోసం గత ఐదేళ్లుగా తదేకం ఫౌండేషన్‌ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. పువ్వుల నుంచి అగర్‌ఒత్తుల తయారీపై 25 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తదేకం ఫౌండేషన్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సుధారాణి కోరారు. పూజా కార్యక్రమాల కు వినియోగించిన పువ్వులు వృధాగా పోతున్నాయని, వీటిని సేకరించి యంత్రాల ద్వారా ప్రోసెసింగ్‌ చేసి కొవ్వొత్తుల తయారీ చేసి మార్కెటింగ్‌ చేసి వ్యాపార వేత్తలుగా రాణించాలన్నా రు. ఇందుకు శిక్షణ, యంత్రాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు తదేకం సంస్థ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం టైలరింగ్‌లో శిక్షణ పూ ర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, ముద్ధన ప్రకాశ్‌, కరెడ్ల గోవిందు, తాటికాయల వీరబాబు, మాదారపు తాతాజీ, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పుల్ల వీరబాబు తదితరులున్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకు న్న నిరుపేదల వైద్యం ఖర్చులను ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా రీఎంబెర్స్‌మెంట్‌ చేస్తున్నట్లు కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఆదివారం గొడారి గుంటలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన రూ.3,87,187 చెక్కులను అందించారు. మండల పార్టీ అధ్యక్షుడు కరెడ్ల గోవిందు తదితర నాయకులు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 01:08 AM