ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పార్కులతో ప్రజలకు ఆహ్లాదం

ABN, Publish Date - Oct 26 , 2024 | 11:53 PM

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్ర జ్యోతి): దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం వాకలపూడిలో వినాయక రామకృష్ణనగర్‌లో కోరమండల్‌ ఇంటర్నేష

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే పంతం నానాజీ

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్ర జ్యోతి): దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం వాకలపూడిలో వినాయక రామకృష్ణనగర్‌లో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సుమారు రూ.50 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో 2.40 ఎకరాల్లో నిర్మిస్తున్న పార్కు అభివృద్ధి, ప్రహారీ, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులను ఆ సంస్థ ఏవీపీ హెచ్‌ఆర్‌ జీఎస్‌వీ రాజా, యూనిట్‌ హెడ్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, జీఎం హెచ్‌ఆర్‌ పద్మనాభంతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడు తూ పార్కు కావాలన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కోరమండల్‌ సహకారంతో అన్ని సౌకర్యాలతో కూడిన పార్కు నిర్మించడం జరుగుతుందన్నారు. వాకలపూడి పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన వైద్య సేవలు, తాగునీటి సరఫరా తదితన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోరమండల్‌ సేవలు అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్కిల్‌ డవలెప్‌మెంట్‌ భవనం నిర్మించి, శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్థానికంగా ఉన్న మెయిన్‌రోడ్డు పక్కన 7 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ ఉత్తర్వులివ్వడం జరిగిందన్నారు. ప్రజలు, నిరుద్యోగ యువత తరపున కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ జారీ చేసిన స్థలం కేటాయింపు ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శి పి పాండురంగారావు చేతుల మీదుగా కోరమండల్‌ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో కోరమండల్‌ ఏసీఎం సీఎస్‌ఆర్‌ జయగోపాల్‌, హెచ్‌ ఆర్‌ వంశీ, కూటమి నాయకులు సలాది శ్రీని వాసు బాబు, గంటా ప్రసాద్‌, చొక్కా జగన్‌, మా తా లక్ష్మణ్‌, కరెడ్ల గోవిందు పాల్గొన్నారు. టాయించిన స్థలాన్ని అధికారులతో పరిశీలించారు.

Updated Date - Oct 26 , 2024 | 11:53 PM