వలసలసల!
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:10 AM
కొవ్వూరు టీడీపీలో వలసలపై సలసల కాగు తున్నారు. వైసీపీ నాయకులు టీడీపీలో చేరడంపై భగ్గుమంటున్నారు.
కొవ్వూరులో భగ్గుమంటున్న టీడీపీ నాయకులు
నెల తరువాత ఆందోళన
ఐదేళ్లు కష్టపడ్డ మా పరిస్థితేంటి?
ఇటీవల సమావేశంలో గొడవ
ఇంత వరకూ మౌనానికి కారణం?
పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ
అధిష్ఠానం వద్ద నిర్ణయం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
కొవ్వూరు టీడీపీలో వలసలపై సలసల కాగు తున్నారు. వైసీపీ నాయకులు టీడీపీలో చేరడంపై భగ్గుమంటున్నారు.గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన నాయకులను ఎలా పార్టీలో చేర్చుకుంటారని మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ టీడీపీ సమావేశంలోనూ స్థానిక నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పి.కృష్ణబాబు అల్లుడు ఎస్.రాజీవ్‌కృష్ణ అనుచరు లతో నవంబరు 14న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రమంత్రి నారా లోకేష్ సమ క్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. నాటి నుంచి చిచ్చు రేగింది. కనీస సమాచారం లేకుండా రాజీవ్‌కృష్ణను పార్టీలో చేర్చుకోవడంపై స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. గత ఐదేళ్లు నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. కేసులు కూడా అనుభవించామని.. ఇప్పుడు ఇలా చేయడం తగదని వాపోతున్నారు. సాధారణంగా ఒక నియోజకవర్గం నుంచి ఇతరులు పార్టీలో చేరేటప్పుడు పార్టీ కూడా అక్కడి పెద్దలు, ఎమ్మె ల్యే, ఇతర నేతల అభిప్రాయాలు తీసుకోవడం సాధారణం. ఏమైందో ఏమో కానీ నేరుగా నారా లోకేష్ సమక్షంలోనే రాజధానిలో పార్టీలో చేర్పిం చుకున్నారు.దీంతో కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ ఇంచుమించు ఖాళీ అయిపోయింది. రాజీవ్‌కృష్ణ అచ్చిబాబుకు వరసకు అల్లుడు కావ డంతో పార్టీ మరింత బలోపేతమవుతుందని అప్పట్లో అధిష్ఠానం భావించింది. కృష్ణబా బు, అచ్చిబాబుల వారసుడిగా రాజీవ్‌కృష్ణ ఇక్కడ బలమైన నేత అవుతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా కొవ్వూరు ఉంది.2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నట్టు అంచనా ఉంది. ఈ నేపఽథ్యంలో ఎవరి రాజకీయ అంచ నాలు, ఆలోచనలు, వ్యూహాలు వారికి ఉంటాయి.
టీడీపీకి రాజీవమా?
ఇటీవల క్రిస్మస్, నూతన సంవత్సర , సంక్రాం తి శుభాకాంక్షలు పేరుతో రాజీవ్‌కృష్ణ ఫొటోతో నియోజకవర్గంలో అనేక చోట్ల హోర్డింగ్‌లు, ఫ్లె క్సీలు వెలిశాయి. అందులో ఎన్టీఆర్, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితర నాయకుల ఫొటోలు ఉన్నాయి. ఇటువంటి హోర్డింగ్‌లు,ఫ్లెక్సీలు నియోజకవర్గం అంతా వెలిశాయి.దీంతో శుక్రవారం జరిగిన టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే,ద్విసభ్య కమిటీ సభ్యుల సమక్షంలో పలువురు కార్యకర్తలు ,కొం దరు ద్వితీయ శ్రేణి నాయకులు రాజీవ్‌కృష్ణను పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు.దీంతో కొవ్వూరు నియోజకవర్గంతో పాటు,జిల్లాలో కూడా చర్చనీయాంశమైంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉన్నవారికి ప్రాధా న్యత ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. రాజీవ్‌కృష పార్టీలో చేరిన సమయంలో ఎవరూ మాట్లాడలేదు. ఇవాళ కొందరు మాట్లాడడం వల్ల అధిష్ఠానం వారి మాటలను ఎలా తీసుకుం టుందోననే చర్చ కూడా జరుగుతోంది. రాజీవ్‌కృష్ణ చేరిక వల్ల పార్టీకి నిస్సందేహంగా మేలు జరుగు తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో రాజీవ్‌కృష్ణ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిం చారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఓ సామాజి కవర్గం పట్ల వైసీపీ వైఖరిని నిరసిస్తూ ఏకంగా మాజీ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ కూడా రాశారు. డైరెక్ట్‌తో జగన్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. అటువంటి నాయకుడు టీడీపీలో చేరడం వల్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతమవుతుందనేది పలువురి వాదన. సమస్యలు ఏమైనా ఉంటే పార్టీలో అందరూ కూర్చుని మాట్లాడుకునే అవకా శం ఉంది. లేదా పార్టీనే తలు, ఎమ్మెల్యే ద్వారా లేదా అక్కడ పెద్దగా ఉన్న అచ్చిబాబు ద్వారా అయినా తమ ఇబ్బం దులేమైనా ఉంటే చెప్పు కునే అవకాశమూ లేకపోలేదు. కానీ ఆకస్మికంగా రోడ్డెక్కడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే అంచనా ఉంది. కార్యకర్తలు పార్టీని దృష్టిలో పెట్టు కుని ఆలోచించాల్సి ఉంది. ఎస్సీ నియో జకవర్గం కావడంతో ఇప్పటి వరకూ కొవ్వూరు నియోజక వర్గానికి ఎక్కడెక్కడి నుంచో నేతలు వచ్చి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గోపాలపురం నుంచి వచ్చిన ముప్పిడి వెంక టేశ్వరరావు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే కాలంలో రిజ ర్వేషన్లు మారే అవకాశం ఉన్నం దు న ఇప్పటి నుంచే నాయకుడిని తయారు చేసేఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం.
అభివృద్ధికి కొవ్వూరు దూరం..
ఇప్పటి వరకూ కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి కంటే కొందరు నేతలు వ్యక్తిగత లబ్ధికే ప్రాధాన్యత ఇస్తారనే విమర్శ ఉంది. అందుకే గోదావరికి ఒక పక్క ఉన్న రాజమహేంద్రవరం మహానగరంగా విస్తరిస్తుంటే.. గోదావరికి మరో పక్కన ఉన్న కొవ్వూరు అభివృద్ధికి దూరంగా ఉం టుంది. ముఖద్వారాల వద్ద, గోదావరి ఒడ్డున పాడై పోయి ఉన్న పార్కుల చూస్తే కొందరి నేతల మనస్తత్వం అర్ధం అవుతుంది. రాజ మహే ంద్రవరానికి ధీటుగా కొవ్వూరు ఎదగాలి. ఇవి రెండూ జంట నగరాలుగా ఎదగడానికి అవస రమైన అనేక వనరులు, ఈప్రాంత ప్రాధాన్యతలు ఉన్నాయి.ఇటువంటివి పట్టించుకుంటేనే నాయకు లవుతారు. కొవ్వూరులో మాత్రం దీనికి రివర్స్. రాజకీయాల్లో ప్రజల ప్రయోజనాలకన్నా.. వ్యక్తి గత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే ఽధోరణి ఇటీవల బాగా పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇది ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడ ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రతి ఎన్నిక ల్లోనూ మార్చేస్తున్నారనే విమర్శ ఉంది. రాజీవ్ కృష్ణను వ్యతిరేకించడంలో కూడా కొంతమంది స్వార్థపూ రిత రాజకీయాలు ఉన్నాయనే చర్చ ఉంది. రాజీవ్‌కృష్ణ కూడా అందరినీ కలుపుకుని పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను,నేతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలసిన అవసరం ఉంది. గతం లోనే ఇక్కడ ఏమైనా సమస్యలుంటే నచ్చ చెప్పి ఎవరి ప్రాధాన్యత వారికి ఇస్తూ పార్టీని ముం దుకు నడిచేలా చూడాలని విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేతకు బాధ్యత అప్పగించింది.
Updated Date - Dec 23 , 2024 | 01:10 AM