ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూమాయ!

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:11 AM

కన్నుపడిందా ఆక్రమించేస్తున్నారు..పత్రాలు మార్చి వేరొకరికి విక్రయించేస్తున్నారు ..

చక్రద్వారబంధంలో భూమి వద్ద గొడవ

ఎకరా రూ. కోటి భూమి రూ.30 లక్షలకే

చక్రద్వారబంధంలో అడ్డుకున్న గ్రామస్తులు

తిరుగుడుమెట్ట భూమిదీ అదే పరిస్థితి

పోలీస్‌ స్టేషన్లలో కేసులు

రాజానగరం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కన్నుపడిందా ఆక్రమించేస్తున్నారు..పత్రాలు మార్చి వేరొకరికి విక్రయించేస్తున్నారు .. జిల్లాలో ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి.. అధికారుల పర్యవేక్షణ కొరవడి భూబకాసురుల ధాటికి బలైపోతున్నారు..తాజాగా రాజానగరం మండలం చక్రద్వారబంధం.. తాళ్ళపూడి మండలం తిరుగుడుమెట్టలో జరిగిన ఘటనలే నిదర్శనం. భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు కొంత మంది రాత్రికి రాత్రే నకిలీ దస్తావేజులు, దొంగ వీలునామాలు సృష్టించి భూయజమానుల కళ్లు కప్పి భూముల క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు. దీనిని నిరోధించాల్సిన కొంత మంది అధికారులు అక్రమార్కు లకు దాసోహమై అందిన కాడికి దండుకుని రికార్డులు తారుమారు చేసేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం మండలం చక్రద్వారబంధం, తాళ్ళపూడి మండ లం తిరుగుడుమెట్టలో ఘటనలే అందుకు నిదర్శ నం. చక్రధ్వారబంధం గ్రామంలో సర్వే నెంబరు 688-1బి; 689-1; 690, 691-6 వెరసి ఎకరాలు 5.587 సెంట్లు భూమి కొమ్మురెడ్డి లక్ష్మీనరసింహం పేరుతో దఖలు పడి ఉంది.ఈ భూమి మామిడి, జీడి మామిడి, సీతాఫలం వృక్షాలతో నిండి ఉంటుంది. సదరు పొలాన్ని గ్రామానికి చెందిన పేపకాయల పోతురాజు గత మూడు దశా బ్దాలుగా కౌలుకు సాగుచేస్తూ వస్తున్నారు. సంబంధిత భూయజమాని గతించిపోవడం, వారసు లకు ఇక్కడ భూమి ఉందన్న విషయం తెలియక పోవడంతో కౌలు రైతు పోతురాజు అధీనంలోనే ఉండి పోయింది. సదరు భూమికి వారసులు ఎవరో తెలియక పోవడంతో దీనిపై కన్నేసిన కొంతమంది స్థానిక వైసీపీ నాయకులు ఇటీ వల వైసీపీ మండల ప్రజాప్రతినిధి సహకారంతో సదరు భూమిని విక్రయించేందుకు ఉప క్రమించారు. దీంతో గత కొంతకాలంగా గ్రామంలో వివాదం నెల కొంది.ప్రస్తుత మార్కెట్‌ విలువ ఎకరం రూ.కోటి వరకు ధర పలుకుతుంది. అయితే సదరు వైసీపీ నాయకులు మాత్రం కారు చౌకగా ఎకరా రూ.30 లక్షలు వంతున విక్రయించినట్లుగా గ్రామంలో చర్చసాగుతోంది. దీంతో ఇంకాస్త ముందడుగు వేసిన అక్రమార్కులు గత రెండు రోజులుగా సదరు పొలంలో ఉన్న చెట్లను తొలగించే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొంతమంది ఆదివారం పొలంలోకి వెళ్లి పనులను అడ్డు కున్నారు.అప్పటికే చెట్లను తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నా రు.నరికిన వృక్షాలను తర లిస్తే ఊరుకోబోమని చెప్పడం తో అక్కడే వదిలిపెట్టి చేసేది లేక సంఘటనా స్థలం నుంచి వెనుతిరిగారు. సదరు భూముల క్రయవిక్రయాల్లో జనసేనకు సంబం ధించిన వాళ్లు కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్ప డంతో ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొంది. విష యం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలా నికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపిం చేశారు.అనంతరం భూముల విక్రయాన్ని వ్యతిరే కిస్తు న్న గ్రామస్తులు కొంతమంది నన్నయ వర్శిటీ సమా వేశంలో ఉన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను కలిసి వివరాలు వెల్లడించారు. దీనిపై ఎమ్మెల్యే స్పం దిస్తూ సదరు భూమికి సంబంధించి సక్రమమైన రికార్డుల్లేకుం డా నకిలీ దస్తావేజులు సృష్టించి విక్ర యాలు సాగిస్తే చర్యలు తీసుకుంటామని గ్రామస్తు లకు హామీ ఇచ్చా రు.ఈ విషయంలో ఏవిధమైన వివాదాలకు తావు లేకుండా ఉండేలా అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా చూడాలని చెంతనే ఉన్న సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ను ఎమ్మెల్యే సూచించారు.

తిరుగుడుమెట్టలో పొలం..

తాడేపల్లిగూడెంలో అక్రమ రిజిస్ట్రేషన్‌

తాళ్లపూడి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) తమ పేర మీద గల భూమి మరొకరి పేర అక్రమంగా రిజిస్ట్రేషన్‌ జరిగిన సంఘటనపై తాళ్లపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండలంలోని తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన రెబ్బాప్రగడ సాయి కృష్ణకు వంశ పారంపర్యంగా గ్రామంలోని 202 సర్వే నెంబరులో య 0.93 సెంట్ల భూమి ఉంది. రెవెన్యూ రికార్డులు పరిశీలించుకనే తరుణంలో తమ పేరున ఉండాల్సిన భూమి ఏలూరు జిల్లా పోలవరం మండలం టేకూరు గ్రామానికి చెందిన చోడిశెట్టి శ్రీనివాసరావు పేర ఉండడంతో హతాశులయ్యారు.వేగేశ్వరపురం సబ్‌ రిజి స్ట్రార్‌ ఆఫీస్‌లో నకలు చూడగా తాడేపల్లిగూడెం రిజి స్ట్రార్‌ కార్యాలయంలో అక్రమంగా వేరొకరిపేర రిజి స్ట్రేష న్‌ జరిగినట్టు గ్రహించి తాళ్లపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా ఎస్‌ఐరామకృష్ణ కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 01:11 AM