ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLA Gorantla: టిడ్కో గృహాలకు వడ్డి మంత్రి తాత కడతారా?.. జగన్ నాన్న కడతారా?..

ABN, Publish Date - Feb 16 , 2024 | 01:05 PM

‘రాజధాని పైల్స్’ సినిమా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?.. ప్రకటనలు పేరుతో వందల కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మృతి చెందిన ఓట్లను తొలగించలేదని, టీడీపీ హయాంలో రాజమండ్రిలో 6,200 టిడ్కో గృహాలు పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలు ఎందుకు లబ్ధిదారులకు అందజేయలేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

రాజమండ్రి: ‘రాజధాని పైల్స్’ సినిమా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?.. ప్రకటనలు పేరుతో వందల కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారు.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన ఓట్లను తొలగించలేదని, టీడీపీ హయాంలో రాజమండ్రిలో 6,200 టిడ్కో గృహాలు పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలు ఎందుకు లబ్ధిదారులకు అందజేయలేదని ఆయన ప్రశ్నించారు. టిడ్కో గృహాలకు వడ్డి మంత్రి తాత కడతారా?.., సీఎం జగన్ నాన్న కడతారా? అని ప్రశ్నించారు.

రాజమండ్రి ఎంపీకి మతిబ్రమించిందని, పంచాయతీల నిదులు ప్రభుత్వం నుంచి ఎందుకు విడుదల చేయలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఎందుకు పంపిణీ చేయలేదన్నారు. ఏ మోహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు. శెట్టి బలిజలకే న్యాయం చేయలేని మంత్రి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వైసీపీ భూకబ్జాలతో రైతాంగం ఆందోళనలో ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్ వైసీపీ ఏజెంట్ లా పనిచేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వమే శాశ్వతం అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మైనింగ్, ఇళ్ల స్థలాల కొనుగోలులో అధికారుల వాటా తేల్చుతామన్నారు. ఆధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి అవినీతి అధికారుల సంగతి చూస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వరద గోదావరిలో వైసీపీ కొట్టుకపోతుందని.. టీడీపీ, జనసేన అధికారంలోకి రావటం ఖాయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

కాగా ‘రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న (గురువారం) కోర్టు స్టే విధించింది. మరోసారి ఈ రోజు (శుక్రవారం) విచారణకు రాగా... సీఎం, ప్రభుత్వం ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. స్టేను కొనసాగించాలని కోరారు. అయితే స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు.

Updated Date - Feb 16 , 2024 | 01:05 PM

Advertising
Advertising