ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద ముంపు నివారణకు ప్రాజెక్టు రూపకల్పన

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:14 AM

గొల్లప్రోలు, సెప్టెంబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు నుంచి పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడేందుకు వేయి కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తెలిపారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అడుగులు వేస్తున్నారని,

గొల్లప్రోలు జగనన్న కాలనీ వద్ద వరద పరిస్థితిని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్‌

ఎమ్మెల్సీ హరిప్రసాద్‌

గొల్లప్రోలు, సెప్టెంబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు నుంచి పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడేందుకు వేయి కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తెలిపారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అడుగులు వేస్తున్నారని, ఇప్పటికే జిల్లా కలెక్టరుతో మాట్లాడటం జరిగిందని చెప్పారు. సుద్దగడ్డ వరదల కారణంగా ముంపునకు గురైన గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే రహదారి, పంటపొలాలను ఆయన ఆదివారం పరిశీలించారు. త్వరలోనే ముంపు సమస్య పరిష్కారమవుతుందన్నా రు. జగనన్నకాలనీ వాసులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భోజనాలు, తాగునీటి అవసరాలను తీర్చాలని స్థానిక నాయకులు, అధికారులకు సూచించామని చెప్పా రు. వరద, వర్షాలు తగ్గిన వెంటనే ప్రత్యామ్నా య మార్గాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల కోసం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌ నివాసంలో అందుబాటులో ఉన్న జనసేన నాయకులతో హరిప్రసాద్‌ సమావేశమయ్యారు. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు.

Updated Date - Sep 02 , 2024 | 12:14 AM

Advertising
Advertising