Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ పోటీ..? వైసీపీలో గుబులు
ABN, Publish Date - Mar 02 , 2024 | 07:50 AM
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీలో గుబులు ప్రారంభమైంది. అక్కడ అభ్యర్ధిని మళ్లీ మూడోసారి మార్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి జగన్ బదిలీ చేశారు.
కాకినాడ: పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ (YCP)లో గుబులు ప్రారంభమైంది. అక్కడ అభ్యర్ధిని మళ్లీ మూడోసారి మార్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు (MLA Dorababu)కు టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీత (Vanga Geetha)ను పిఠాపురానికి జగన్ (CM Jagan) బదిలీ చేశారు. ఇప్పుడు పవన్ పోటీ చేస్తారన్న భయంతో మళ్లీ అభ్యర్థిని మార్చడానికి అడుగులు వేస్తున్నారని టాక్.
అసెంబ్లీ ఇన్‌చార్జిగా కోరి మరీ తెచ్చుకున్న వంగా గీతను అక్కడి నుంచి పంపేసేందుకు వైసీపీ యత్నిస్తోందని సమాచారం. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న కలిసిన గీతకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఈమె స్థానంలో పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభా (Mudragada Padmanabham)న్ని బరిలోకి దించాలని వైసీసీ యోచిస్తోంది. వైసీపీ తీరు నచ్చక ఇటీవల ఆ పార్టీకి ముద్రగడ దూరంగా ఉన్నారు. టికెట్ ఇవ్వకుండా అవమా నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు వచ్చినా మాట్లాడేందుకు నిరాకరించారు. తాజాగా టీడీపీ (TDP)తో పొత్తుకు సంబంధించి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు జగన్ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పవన్ పై ముద్రగడను నిలబెట్టేందుకు రహస్యంగా సమాలోచనలు చేస్తోందట.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 07:50 AM