ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొలిమేరు టు కాకినాడ

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:46 AM

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరుగ్రామంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతుం ది. 2రోజులు క్రితం పంట పొలాల్లో ఓ పౌలీ్ట్రలో పెద్ద ఎత్తున పట్టుబడిన పీడీఎస్‌ డంప్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయిం

కొలిమేరులో ఒక రైస్‌ మిల్లులో పట్టుబడిన పీడీఎస్‌ బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కదులుతున్న రేషన్‌ మాఫియా డొంక

పట్టుబడిన 69 క్వింటాళ్లు

పీడీఎస్‌ బియ్యం గుట్టురట్టు

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరుగ్రామంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతుం ది. 2రోజులు క్రితం పంట పొలాల్లో ఓ పౌలీ్ట్రలో పెద్ద ఎత్తున పట్టుబడిన పీడీఎస్‌ డంప్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. సంబంధిత బియ్యం వివరాల కోసం ల్యాబ్‌కు తరలించగా కాకినాడ పోర్టు కేంద్రంగా విదేశాలకు అక్రమ రవాణా అవుతున్న బియ్యం, కొలిమేరులో పట్టుబడిన బియ్యం ఒకే రకానికి చెందినవిగా రిపోర్టులు రావడం సంచలనం రేకెత్తించింది. దీంతో రెవె న్యూ అధికారులు మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేయగా కొలిమేరు గ్రామ శివారున ఓ వైసీపీ నాయకుడికి చెందిన రైస్‌ మిల్లులో పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టారు. దీంతో రైస్‌మిల్లులో తరలింపునకు సిద్ధంగా ఉన్న 69 క్వింటాళ్ల పీడీ ఎస్‌ బియ్యం పట్టుబడ్డాయి. సీజ్‌ చేసిన అధికారులు దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిల్లు నిర్వాహకులతో పాటుగా గొల్లప్రోలుకు చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుం ది. ఇప్పటికే రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ కోళ్లఫారంలో పట్టుబడిన బియ్యానికి సంబంధించి గొల్లప్రో లుకు చెందిన ఒక వ్యక్తిపై కేసు నమోదైంది. దీని వెనుక ఎవరు ఉన్నారు?ఎంత కాలం నుంచి జరుగుతున్నందనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు ఎంఎస్‌వో వి.రాజు చెప్పారు. తనిఖీల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ తాతారెడ్డి, వీఆర్వో తదితరులున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 12:46 AM