కూటమి ప్రభుత్వంతోనే మౌలిక సదుపాయాలు కల్పన
ABN, Publish Date - Nov 05 , 2024 | 12:54 AM
సామర్లకోట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో అన్నిమౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడు తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆద్వర్యంలో సామర్లకోట మండలం హుస్సే
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
సామర్లకోట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో అన్నిమౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడు తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆద్వర్యంలో సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో కొత్తపేట నందు సోమవారం రూ.24.23 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును రాజప్ప ప్రారంభించి తాగునీటి కుళాయి తిప్పి మహిళలకు బిందె అందించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో సుందరీకరణ పనులు, పంచాయతీ ఆదాయ వనరుల పెంపుద లకు నూతనంగా నిర్మించనున్న 4 దుకాణ సము దాయాల కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారం భించారు. చిన్న గ్రామాల్లో సైతం అంతగా పను లు లేకున్నా 11 మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటుచేసి గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గ్రామంలో వనరుల పెంపుదలకు సమష్టిగా కృషి చేయడమే గాకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలకు పార్టీలకతీతంగా నమోదు లు చేపట్టాలని రాజప్ప సూచించారు. కార్యక్ర మంలో డబుల్ సెవెన్ రాజు, టీడీపీ మండలా ధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, గుమ్మళ్ళ రామకృష్ణ, చల్లా బుజ్జి, కూటమి నాయకులు పాల్గొన్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రా మంలో 1 నుంచి పదవతరగతి వరకూ ప్రైవేట్ యాజమాన్యం నిభంధనలకు విరుద్ధంగా నిర్వ హిస్తూ లక్షలాది రూపాయలు విద్యార్దుల నుంచి ఆర్జిస్తూ పంచాయతీకి ఒక్క రూపాయి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో గ్రామ ఎంపీటీసీ, మాజీ జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు మలకల సూర్యారావు చినరాజప్పకు ఫిర్యాదు చేశారు.
చినరాజప్ప ప్రత్యేక పూజలు
కార్తీకమాసం తొలి సోమవారం మహా పర్వదినం సందర్బంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప,అనూరాధ దంపతులు సామర్లకోట భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. వారికి ఆలయ ఈవో నీలకంఠం ఆధ్వర్యంలో పండితులు సాదరంగా స్వాగతం పలికారు. ము ందుగా కాలభైవరస్వామిని దర్శించి ఆలయ ఆవరణలో అన్ని ఉపాలయాల్లో దేవతామూర్తుల ను దర్శించారు. భీమేశ్వరస్వామికి అభిషేకపూజ లు, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి విశేష పుష్పార్చన పూజలు చేసారు. నందిమండపం వద్ద ఎమ్మెల్యే దంపతులకు పండితులు వేదాశీ ర్వచనం అందజేసి ప్రసాదాలను అందజేసారు. ఆలయంలో భక్తులకు చేపట్టిన పలు ఏర్పాట్లను సమీక్షించి మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. డబుల్ సెవెన్ రాజు పాల్గొన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 12:54 AM