ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:32 AM

పెద్దాపురం, సెప్టెంబరు 13: ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతుకు కూటమి ప్ర భుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినారాజప్ప అన్నారు. మండలంలోని కట్టమూరులో ఏలేరు వరద ఉధృతి కారణంగా నీటమునిగిన పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. వ్యవసాయ,

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం, సెప్టెంబరు 13: ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతుకు కూటమి ప్ర భుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినారాజప్ప అన్నారు. మండలంలోని కట్టమూరులో ఏలేరు వరద ఉధృతి కారణంగా నీటమునిగిన పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులతో మాట్లాడి ఎం తమేర నష్టంవాటిల్లిందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు పరిహారం అందచేయడం జరుగుతుం దని, అందుకోసం రైతులు రైతుసేవా కేంద్రంలో ఆధార్‌, పొలానికి సంబంధించిన పాస్‌బుక్‌. బ్యాంక్‌ అకౌంట్‌ తదితర జిరాక్స్‌ కాపీలను తీసుకువెళ్లి తమ పేర్లు నమోదుచేసుకోవాలని కోరారు. పలువురు రైతులు ఏలేరు వరదల కారణంగా జగ్గన్న కాలువకు గండి పడిందని, కాండ్రకోట నుంచి వచ్చే నీరు ఈ గండి కారణంగా తక్కువగా వస్తోందని, ఈనీటి కారణంగా కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలు పంట సాగవుతుందని, కాలువను పునరుద్ధరించాలని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏవో కొమ్మోజు సంజయ్‌కుమార్‌, హెచ్‌వో నూనే సుజాత, కూటమి నేతలు రాజాసూరిబాబురాజు, ఎలిశెట్టి నాని, మేడిది శ్రీనివాస్‌, సానిపిన రామకృష్ణ, యేలేటి సత్తిబాబు, సుబ్బారావు, అడపా గంగాధర్‌, మాదిరెడ్డి రామకృష్ణ, అడపా శివదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 12:32 AM

Advertising
Advertising