పెద్దాపురం సుందరీకరణకు చర్యలు
ABN, Publish Date - Oct 28 , 2024 | 01:17 AM
పెద్దాపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణ సుందరీకరణకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శతాబ్ది పార్కులో సందర్శకుల కోసం ప్రైవేటు భాగస్వా మ్యంతో ఏర్పాటుచేసిన ఫలహారశాలను
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణ సుందరీకరణకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శతాబ్ది పార్కులో సందర్శకుల కోసం ప్రైవేటు భాగస్వా మ్యంతో ఏర్పాటుచేసిన ఫలహారశాలను జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్ తుమ్మల రామస్వామి (బాబు)తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దా పురం నియోజకర్గంలో ఉన్న రెండు మున్సి పాల్టీలను దశలవారీగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే శతాబ్ది పార్కును చాలావరకూ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ పాలకులు పార్కును నిర్వీర్యం చేశా రని, దీంతో ప్రజలకు ఆహ్లాదం కరువయ్యింద న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత మళ్లీ పార్కుకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు రాజాసూరిబాబురాజు, తూతిక రాజు ఉన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 01:17 AM