ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు అండగా ఉంటాం : వర్మ

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:22 AM

పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతిని

ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం మండలం బిప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, కోలంక, గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించి ముంపు పొలాల ను పరిశీలించారు. గొల్లప్రోలులో జగనన్న కాలనీ వాసులకు, సూరంపేట ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణను కూటమి ప్రభుత్వం చేపడుతుందని, వరద ముంపు నుంచి శాశ్వతరక్షణ కల్పిస్తామని చెప్పారు. వరద ముంపు తగ్గగానే నష్టాలను అంచనా వేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, సకుమళ్ల గంగాధర్‌, గుండ్ర సుబ్బారావు, వెన్నా గోపి, ఎలుబండి బాబులు ఉన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:22 AM

Advertising
Advertising