ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏలేరు పనులు రద్దుతోనే అపారనష్టం : వర్మ

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:00 AM

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన భారీ గండిని శనివారం పరిశీలించారు. ముందు జరుగుతున్న పనులు ఎందుకు రద్దు చేశారో మా జీ ఎంపీ, వైసీపీ ఇన్‌చార్జి వంగా గీత సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే రహదారి దాదాపు నెలరోజులుగా వరద నీటి ముంపులో ఉందని, వైసీపీ పాలనలో అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయకుండా ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను అన్నింటిని సరిచేస్తున్నామని, త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెన్నా గోపి, బెజవాడ సురేష్‌, బర్ల చినఅప్పన్న, పపిల్లా సురేష్‌, గట్టి శ్రీను, మాదాబత్తుల బాబూరావు, నూలు సుబ్రహ్మణ్యం, నెక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 12:00 AM

Advertising
Advertising