ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:58 AM

పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా

పిఠాపురంలో పూజలు చేస్తున్న జనసేన నాయకులు

పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో సోమవారం పూజలు నిర్వహించారు. అర్బన్‌ బ్యాంకు కార్యాలయం నుంచి మహాసంస్థానం వరకూ జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, బీజేపీ నాయకులు ప్రదర్శన జరిపారు. ఆలయంలో శ్రీపాదశ్రీవల్లభులు, దత్తాత్రేయస్వామి, నృసింహ సరస్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పిఠాపురం ఇన్‌ చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులున్నారు.

కష్టాలు తెలుసుకున్నా : పవన్‌

మహారాష్ట్రలో ఎన్‌డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడి భక్తులు పిఠాపురం శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానానికి వచ్చేందుకు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల మీదు గా వచ్చే రైళ్లన్నింటికి పిఠాపురంలో హాల్ట్‌ కల్పించే విధంగా రైల్వేశాఖ దృష్టికి తీసుకువెళ్లతానని చెప్పారు. లాతూర్‌ నుంచి తిరుపతికి విమానసర్వీసులు నడిపేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయితీ కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ పిఠాపురంలో జనసేన, బీజేపీ శ్రేణులు పూజలు నిర్వహించారని ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 12:58 AM