ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా అధికారులు

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:51 AM

పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ వార్డుల్లో పూర్తిగా అభివృద్ధి పనులు నిలిపివేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వార్డుల్లో తప్ప, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని వారు తెలిపారు. తక్షణం తమ వా

కమిషనర్‌కు వినతి అందజేస్తున్న కౌన్సిలర్లు

టీడీపీ కౌన్సిలర్ల ఆగ్రహం

పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ వార్డుల్లో పూర్తిగా అభివృద్ధి పనులు నిలిపివేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వార్డుల్లో తప్ప, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని వారు తెలిపారు. తక్షణం తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పిఠాపురం మున్సిపల్‌ కమిషనరు కనకారావును కలిసి వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం సమయంలో తాము ప్రాతినిధ్యం వహించే వార్డులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే వార్డుల్లో పనులు చేయిస్తూ అధికారులు ఏకపక్షంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అటువంటప్పుడు తమ వార్డుల్లో ప్రజల నుంచి ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ వార్డుల్లో గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నింటిని తిరిగి ప్రారంభించాల ని, పనుల నిర్వహణలో తమ వార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో అస లు పనులు జరగని ప్రాంతాలను గుర్తించి అక్క డ చేపట్టాలని కోరారు. కౌన్సిలర్లుగా నెగ్గిన తా ము మూడున్నరేళ్లుగా పనుల కోసం ఎదురుచూస్తునే ఉన్నామని, అధికారుల సహకరించకపోవడంతో పనులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్‌, పంపనబోయిన అన్నపూర్ణ, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, నల్లా రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:51 AM