AP News: కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..
ABN, Publish Date - May 10 , 2024 | 07:51 AM
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
కాకినాడ: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ (Kakinada) సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో (Road Show), సభ (Sabha)కు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి (MLA Dwarampudi) బైక్ ర్యాలీ (Bike Rally) ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ పర్యటన రూట్ మార్చి ఎనిమిది ప్రాంతాల్లో దరఖాస్తు చేసినా పోలీసులు (Police) పర్మిషన్ ఇవ్వలేదు. వైసీపీ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతుల కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు పడిబాపులు కాసారు. అయినా పోలీసులు అనుమతి ఇవ్వడానికి ససేమిరా అన్నారు.
కాగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇక రెండురోజులే గడువు ఉంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. తర్వాత అభ్యర్థులు కానీ, పార్టీలు కానీ ఎటువంటి ప్రచారం చేయకూడదు. 11వ తేదీ రాత్రి, 12వ తేదీ రాత్రి మరింత కీలకంగా మారనుంది. ఎక్కడ సమస్య ఉన్నా ఆ రెండు రాత్రులు చక్కబెట్టుకుంటారు.
మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. మూడు చోట్ల స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌ల్లో పవన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌లో గురువారం జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయకుమార్, పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావులు వెల్లడించారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు పిఠాపురం మండలం చిత్రాడ నుంచి పవన్ రోడ్‌షో ప్రారంభమవుతుంది. అనంతరం 216వ జాతీయ రహదారి మీదుగా పిఠాపురం ఎంపీడీవో కార్యాలయం పక్క నుంచి జగ్గయ్యచెరువు కాలనీలోకి వెళ్లి అక్కడ రాజీవ్‌గృహకల్ప అపార్ట్‌మెంట్లు, సామర్లకోట రోడ్డు, పాదగయ, తహసీల్దారు కార్యాలయం సెంటర్ మీదుగా పాతబస్టాండు, ఉప్పాడ బస్టాండు సెంటర్‌కు చేరుకుని అక్కడ జరిగే స్ట్రీట్‌కార్నర్ సమావేశంలో మాట్లాడతారు. అనంతరం కోటగుమ్మం, మార్కెట్, చర్చిసెంటర్, ఆర్టీసీ బస్‌కాంప్లెక్సు, అగ్రహారం, పశువుల సంత మీదుగా రోడ్‌షో కొనసాగి గొల్లప్రోలు పట్టణంలోకి ప్రవేశిస్తుంది. గొల్లప్రోలులోని మెయిన్‌రోడ్డు, పాతబస్టాండు, రాయవరం సెంటర్, రామాలయం, పల్లపువీధి, ఎంపీడీవో కార్యాలయం, ఈబీసీ కాలనీ మీదుగా రోడ్‌షో ఉంటుంది. అక్కడ జరిగే సమావేశంలో పవన్ ప్రసగించనున్నారు. గొల్లప్రోలు, చేబ్రోలులో రోడ్‌షో అనంతరం మధ్యాహ్నం 3గంటలకు విరామం తీసుకుంటారు. తిరిగి సాయంత్రం 4గంటలకు చేబ్రోలు నివాసం నుంచి పవన్ బయలుదేరి ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల మీదుగా రమణక్కపేట, కోనపాపపేట, మూలపేట, అమీనాబాదు గ్రామాల మీదుగా ఉప్పాడ చేరుకుంటారు. అక్కడ రాత్రి 7గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించి కొత్తపల్లి, యండపల్లి, కొండెవరం, నవఖండ్రవాడ గ్రామాల మీదుగా మరలా రాత్రి 10 గంటల సమయానికి పిఠాపురం చేరుకుంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పిఠాపురంలో పవన్ విజయం ఇప్పటికే ఖరారయిందని, మెజార్టీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని తెలిపారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా పవన్ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం
సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!
సీరియల్ నటి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు లీక్.. నెట్టింట రచ్చరచ్చ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 10 , 2024 | 07:54 AM