ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ABN, Publish Date - Sep 17 , 2024 | 01:19 AM

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే. అందుకే పట్టణాలు, నగరాల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ చాలా కీలకం. ఇప్పుడు చారిత్రాత్మక రాజమహేంద్రవరానికి నూతన రూపం తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం ఈ దిశగా సన్నద్ధమవుతోంది. రాజమహేంద్రవరం నగరం వైశాల్యం 44.5 స్వ్కేర్‌ కి.మీగా ఉంది. 50 డివిజన్లలు, సుమారు 5 లక్షల మంది జనాభా, 600 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థతో మహానగరంగా రాజమహేంద్రవరం ఉంది. చారిత్రక ప్రదేశాలను పరిరక్షిస్తూనే నగరాన్ని మరింత విస్తరించి మహానగరంగా మార్చే ఆలోచనకు అధికారులు కార్యరూపం దాల్చే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

కొత్త మాస్టర్‌ ప్లాన్‌తో రహదారుల విస్తరణ

2027 పుష్కరాల నాటికి మహానగరంగా తీర్చిదిద్దే యోచన

(రాజమహేంద్రవరం సిటీ)

తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరం ప్రధానంగా వాణిజ్య నగరం. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం ముఖ్య నగరం కూడా. అటు విజయవాడ, ఇటు విశాఖపట్నం నగరాలకు మధ్యలో ఉన్న రాజమహేంద్రవరం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చట్టుపక్క ల సుమారు 15 గ్రామాలను నగరంలో విలీనం చేసి నగర విస్తరణను పెంచుతూ రాజమహేంద్రవరానికి మరింత శోభ వచ్చే విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ దిశగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ సన్నద్ధం చేశారు. ఇందు లో భాగంగా రాజమహేంద్రవరానికి 2017లో రూపొందించిన నూతన మాస్టర్‌ ప్లాన్‌ను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అమలుచేయబోతున్నారు. ఈ ప్లాన్‌ ప్రకారం నగరంలో చాలా రహదారులు వెడల్పుచేయాల్సి ఉం ది. గత ప్రతిపాదనలతోపాటు కొత్తగా అనేక రహదారులను అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధమతున్నారు. నగరంలో ఆలకట్‌ గార్డెన్స్‌, ఈస్ట్‌ రైల్వేస్టేషన్‌ మొదలుకొని దానికి అనుసంధానంగా ఉన్న రహదారులన్నీ వెడల్పుచేసి అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి నుంచి రాజమహేంద్రవరంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారులను విస్తరించబోతున్నారు.

తూర్పు రైల్వేస్టేషన్‌ నుంచి..

రాజమహేంద్రవరంలో ప్రధాన రైల్వేస్టేషన్‌ నగరానికి పడమర వైపు ముఖంగా ఉంది. తూర్పువైపున ఉన్న ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌ను మరింతగా అభివృద్ధి చేయడంలో భాగంగా సుమారు రూ.270 కోట్లు కేంద్ర ప్రభుత్వ రైల్వే నిధులతో రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ రూపురేఖలు మార్చబోతున్నారు. తూర్పు నుంచి ఈ స్టేషన్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే దానికి అవసరమైయ్యే రహదారులను నిర్మించేందుకు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్లను వెడల్పుచేసి వాటిని జాతీయ రహదారికి, నగరంలోకి అనుసంధానం చేసేందుకు రహదారుల విస్తరణ చేయబోతోంది. ఆలకట్‌ గార్డెన్స్‌ నుంచి పేపరుమిల్లు వరకు ఆయా రహదారులను వెడల్పు చేయబోతోంది.

2027 పుష్కరాల నాటికి తీర్చిదిద్దేలా..

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరాన్ని మరింతగా అభివృద్ధి చేసి మహానగరంగా తీర్చిదిద్దే ఆలోచనతో అధికారులు ముందుకు సాగుతున్నారు. నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, రహదారులు, ట్రాఫిక్‌ నియంత్రణ, దేవాలయాల సముదాయాల అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి.. ఇలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని 2027 నాటికి రాజమహేంద్రవరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నూతన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ప్రతీ కూడలి, ప్రతీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను విస్తరిస్తూ అభివృద్ధిపరచాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అంతర్గత రహదారులు వెడల్పు చేయాలని, నగరంలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేవిధంగా ఆక్ర మణలు తొలగించాలని నిర్ణయించారు.

2017 మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రహదారుల వెడల్పు

రాజమహేంద్రవరం నగరంలో 2017లో రూపొందించిన నూతన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నగరంలో రహదారులు వెడల్పు చేసేందుకు అప్రూవల్‌ తీసుకోవాలి. అందుకు సన్నద్ధమవుతున్నాం. అటు ఆల్కాట్‌ గార్డెన్స్‌ మొదలుకొని ఈస్ట్‌ స్టేషన్‌, బాలాజీపేట రోడ్డు, జాతీయ రహదారికి ఇటు ఆవ రోడ్డు మీదుగా ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు, మునిసిపల్‌ స్టేడి యం రోడ్డు, గోదావరి రేవులకు వెళ్లే ప్రతి రహదారులను వెడల్పుచేస్తాం. పేపరుమిల్లు వరకు ఈ రహదారులు విస్తరణ ఉంటుంది. 40 అడుగులు, 60 అడుగులు, 80 అడుగులు రహదారుల వెడల్పుల పనులు ప్రభుత్వ అనుమతులతో పూర్తి చేయాల్సి ఉంది.

- జీవీఎస్‌ఎన్‌ మూర్తి, సిటీ ప్లానర్‌,

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ

Updated Date - Sep 17 , 2024 | 07:12 AM

Advertising
Advertising