గ్రీన్ టిబ్యునల్ ఉత్తర్వుల మేరకు చెరువుల తొలగింపు
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:27 AM
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు మలికిపురం మండలం గొల్లపాలెం, తూర్పుపాలెంలలో ఆరు చెరువులకు గండ్లు కొట్టినట్టు ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు.
మలికిపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు మలికిపురం మండలం గొల్లపాలెం, తూర్పుపాలెంలలో ఆరు చెరువులకు గండ్లు కొట్టినట్టు ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 19 చెరువులకు గండ్లు కొట్టాల్సి ఉండగా శుక్రవారం తూర్పుపాలెం, గొల్లపాలెంలలో ఆరు చెరువులకు గండ్లు కొట్టారు. ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా రాజోలు సీఐ టి.నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో మలికిపురం, రాజోలు ఎస్‌ఐలు మరో 30 మంది పోలీసు బందోబస్తుతో రెవెన్యూ, మత్స్యశాఖ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ విష్ణువర్ధన్, మలికిపురం ఎస్‌ఐ పి.సురేష్ పాల్గొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు చెరువులను తొలగిస్తున్నట్టు తహశీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు.
Updated Date - Dec 21 , 2024 | 01:27 AM