ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.20 లక్షలకు రూ.20 కోట్లు వస్తాయని...

ABN, Publish Date - Dec 19 , 2024 | 12:49 AM

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 18 (ఆంధ్ర జ్యోతి): రైస్‌ పుల్లింగ్‌ పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన ఏడుగురు నిందితులను సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటకు చెందిన పెనుమత్స నాగరాజు కాంట్రాక్ట్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుమారు ఏడాది కింద అరకు వెళ్లాడు. అక్కడ నాగరాజుకి ఏఎస్‌ఆర్‌ జిల్లా పిట్ట డుమ్ముగూడెం మండలం పాడి గ్రామానికి చెందిన పిట్ట గుం డన్న, చిం

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సర్పవరం సీఐ పెద్దిరాజు

రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మోసం చేసిన ఏడుగురి అరెస్ట్‌

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 18 (ఆంధ్ర జ్యోతి): రైస్‌ పుల్లింగ్‌ పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన ఏడుగురు నిందితులను సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటకు చెందిన పెనుమత్స నాగరాజు కాంట్రాక్ట్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుమారు ఏడాది కింద అరకు వెళ్లాడు. అక్కడ నాగరాజుకి ఏఎస్‌ఆర్‌ జిల్లా పిట్ట డుమ్ముగూడెం మండలం పాడి గ్రామానికి చెందిన పిట్ట గుం డన్న, చింతపల్లి మండలం కోతపల్లికి చెందిన గోపీనాయక్‌, చిన్నలగూడకు చెందిన కిల్లో శ్యాంసన్‌, కడసిల్పికి చెందిన పొంగి దోహన్‌రావు, అరకు వ్యాలీ చిన్నలాబుడకు చెందిన గోపినాయక్‌ తిరుపతిరావు, కరబలయ్య సుజాత, సెట్టి బుల్లెమ్మలతో పరిచయం ఏర్పడింది. తమ వద్ద కోట్లు విలువ చేసే రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ ఉందని, దీనిని విక్రయిస్తే అధిక డబ్బులు సంపాదించవచ్చని, పెట్టుబడి పెట్టాలని నాగరాజుని కోరారు. ఓ కాయిన్‌ని చూపించి ఆశ కల్పించారు. రూ.20లక్షలు పెట్టుబడి పెడితే రూ.20 కోట్లు వస్తాయని నమ్మించారు. వారి మాటలను నమ్మిన నాగరాజు స్నేహితులతో కలిసి నిందితుల అకౌంట్‌లోకి పలు దఫాలుగా రూ.20 లక్ష లు పంపాడు. మంగళవారం నిందితులు నాగరాజుకి ఫోన్‌ చేసి రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ తీసుకువస్తున్నామని, డబ్బులు సిద్ధంగా ఉంచుకోమని చెప్పారు. డబ్బులు తీసుకుని వెళ్లగా రాగి కా యిన్‌ ఇచ్చారు. అది పరిశీలిస్తే సీతారామ పట్టాభిషేకం బొమ్మతో ఉంది. మోసపోయినట్టు గుర్తి ంచిన నాగరాజు వారిని ప్రశ్నించాడు. దాంతో నిందితులు చాకు చూపించి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. దీంతో బాధితుడు పోలీ సులకు ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బి.పెద్దిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు సురేష్‌నగర్‌ పార్కు వద్ద ఉండగా అరెస్ట్‌ చేసి రూ.50 వేలు, చాకు, రాగి కాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పలువురు నుంచి రైస్‌పుల్లింగ్‌ కాయిన్‌ పేరు చెప్పి మోసంచేసి ఉంటారని తెలిపారు.

Updated Date - Dec 19 , 2024 | 12:49 AM