ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సచివాలయాలు చక్కదిద్దేలా

ABN, Publish Date - Aug 29 , 2024 | 01:32 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను సమర్ధవంతంగా పనిచేయించడం మొదలైంది. గాడిలో పెట్టే దిశగా ఇప్పటికే సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశంలో కూడా ప్రస్తావించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనూ గందరగోళం

సిబ్బంది సహేతుక క్రమబద్ధీకరణకు సీఎం నిర్ణయం

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల విషయంలోనే సందిగ్ధం

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను సమర్ధవంతంగా పనిచేయించడం మొదలైంది. గాడిలో పెట్టే దిశగా ఇప్పటికే సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశంలో కూడా ప్రస్తావించారు. సిబ్బందిని సహేతుకంగా క్రమబద్ధీకరించి మానవ వనరులను ప్రజా సేవకు మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని నిర్ణయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ లబ్ధి, ప్రచార ఆర్భాటంకోసం జగన్‌ ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాలు అస్తవ్యస్తంగా మారాయి. జాబ్‌ చార్టుకు సంబంధం లేకుండా సొంత పనులతో వైసీపీ నేతలు పెత్తనం చెలాయించారు. దీంతో ప్రజా సేవలు కుంటుబడ్డాయి. కూటమి ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో పింఛన్లను ఇంటింటికీ పంపించడంలో ఇప్పటికే విజయం సాధించింది. దీంతో సచివాలయాలను సవ్యదిశలో పెడితే ప్రజలు మరింతగా ఉపయోగపడతా యనే వాస్తవం వెలుగు చూసింది. దీంతో అవసరమైన మేరకే సిబ్బందిని సచివాలయాల్లో ఉంచి మిగతా వారిని మాతృశాఖలకు పంపించాలని సీఎం యోచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 11 మంది సిబ్బంది అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ లెక్క ఎప్పుడూ సరిపెట్టలేదు. తర్వాత ఎన్నికలకు ముందు సర్దుబాటు పేరుతో ముగ్గురికి కోత విధించి 8తో సరిపెట్టింది. ప్రస్తుతం జిల్లాలో రూరల్‌ మండలాల్లో 393, అర్బన్‌లో 119 సచివాలయాలు కలిపి మొత్తం 512 ఉండగా.. 8 మంది సిబ్బందికంటే తక్కువగా 116 ఉంటే, 8 మందికంటే ఎక్కువగా 262 మంది ఉన్నారు. 8 మంది సిబ్బంది ఉన్న సచివాలయాలు 134 ఉన్నాయి. వా ర్డు సచివాలయాలు 119 ఉన్నాయి. రూరల్‌ సచివాలయాల్లో 3140, అర్బన్‌లో 940 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అత్య ధిక సచివాలయాల్లో 10 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా రాజమహేంద్రవరం అర్బన్‌లో 8 కంటే ఎక్కువగా సిబ్బంది ఉన్న సచివాలయాలు 29 ఉన్నాయి. తర్వాత స్థానాల్లో కోరుకొండ-22, నిడదవోలు-21 ఉన్నాయి. కొన్నిచోట్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొన్నిచోట్ల పనిలేకపోవడాన్ని ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకునే పనిలో భాగంగా ఆ సంఖ్యను క్రమబద్ధీకరించాలని తాజాగా కూటమి ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.

మాతృ శాఖకు ఎవరు?

గ్రామాల్లో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీస్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌ 5), గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసి స్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, ఫిషరీస్‌ అసిస్టెంట్‌, ఎనర్జీ అసిస్టెంట్‌ ఉంటారు. పట్టణాల్లోని సచివాలయాల్లో వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌, అడ్మిస్ట్రేటివ్‌, మహిళా పోలీస్‌, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌, ఎమెనిటీస్‌, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంట్‌, రెవెన్యూ, హెల్త్‌ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్‌లు ఉన్నారు. వీరి సర్వీసు రిజిస్టర్లు వగైరా ఆయా డిపార్టుమెంట్ల పరిధిలోనే ఉంటాయి. అయితే రూరల్‌ ప్రాంతాల్లో ఇంజనీ రింగ్‌ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌, ఫిషరీష్‌ అసిస్టెంట్‌లను మాతృ శాఖలకు పంపించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయాల్లో పనిచేయడం లేదు. దీంతో వీళ్లు విద్యుత్‌శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వార్డు సచి వాలయాల్లో అడ్మిన్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, సంక్షేమ కార్య దర్శి, శానిటేషన్‌ కార్యదర్శి, ఏఎన్‌ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను కొనసాగిస్తారు. మిగిలిన వారిని మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగిస్తారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ సర్వేయర్‌ అసిస్టెంట్‌, పశు సంవర్ధక సహాయకుల పోస్టులను ఇకపై రద్దు చేయనున్నారు. వారిని క్లస్టర్‌ విధానంలో మాతృశాఖల అధీనంలోకి తీసుకెళ్తారు.

సందిగ్ధం ఇదేనా..!

సచివాలయాల సిబ్బంది గతంలో వైసీపీ నేతలకు అను కూలంగా పనిచేసేలా పూర్తిస్థాయిలో వినియోగించుకున్నా రు. ఆ సిబ్బందికి ఒక పని అని నిర్ధిష్టంగా ఉండేది కాదు. పైఅధికారులు, వైసీపీ నాయకులు ఏది ఆదేశిస్తే అది పాటించాల్సిందే. అయితే ఇప్పుడు సీఎం చంద్ర బాబు తీసుకోనున్న నిర్ణయంపై సచివాలయ ఉద్యోగు ల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. కానీ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లలో అంతర్మథనం కొనసాగుతోంది. జిల్లాలోని అర్బన్‌ సచివాలయాల్లో వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులే షన్‌ కార్యదర్శులు 85 మంది, రూరల్‌ సచివాలయాల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు 340, సర్వే అసిస్టెంట్లు 360 మంది ఉన్నారు. అర్బన్‌ సచివాలయాల్లోని ప్లానింగ్‌ కార్యదర్శులను మునిసిపాలిటీలకు పంపించినా రూరల్‌ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌, సర్వే అసిస్టెంట్లను ఏ శాఖకు పంపిస్తారో అనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌ బీ, ఆర్‌డబ్లుఎస్‌ శాఖలకు కేటాయిస్తారని అనుకున్నా రు. అయితే వీళ్లను ఇరిగేషన్‌ శాఖకు కేటాయిస్తారనే వాదన నడుస్తోంది. సివిల్‌తోపాటు మెకానికల్‌ చదివిన వారు కూడా ఉన్నారు. అందువల్ల ఇరిగేషన్‌కి అయితే పూర్తిగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తున్న ట్టుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించడంతో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల అవసరత పెద్దసంఖ్యలో ఉంది. దీంతో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను పెద్దసంఖ్యలో పోల వరం ప్రాజెక్టుకు కేటాయించే అవకాశం లేకపోలేదు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ప్రధానంగా గ్రామాల్లోని ఆర్‌ డబ్ల్యుఎస్‌, హౌసింగ్‌, జల్‌జీవన్‌ మిషన్‌, పంచాయతీ రాజ్‌ వర్కులు, రోడ్లు, డ్రైన్లు, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ వంటి ఇంజనీరింగ్‌ సంబంధిత నిర్మాణా లను పర్యవేక్షిస్తున్నారు. వీరికి ఎంబుక్‌ నమోదు చేసే అధికారం ఇవ్వడంతో చాలా మటుకు ఉపయోకరమైం దని చెబుతున్నారు. వీటికోసం మండల ఇంజనీరింగ్‌ అధికారి, హౌసింగ్‌ ఏఈ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ ఆయా గ్రామాలకు రావాలంటే తాత్సారం జరిగేదని, బిల్లుల నమోదు, ఎంబుక్‌ల రికార్డింగ్‌ వంటికి చాలా ఆలస్యం అయ్యేవని.. ఇప్పుడు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు అందు బాటులో ఉండడంతో ఇబ్బంది తప్పిందంటున్నారు. ఇక బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు మ్యూచువల్‌, రిక్వెస్టు బదిలీలు జరుగుతు న్నాయి. త్వరలోనే సర్దుబాట్ల నిర్ణయం వెలువడవచ్చు.

జిల్లా అధికారి లేరండీ...

గ్రామ, వార్డు సచివాలయాల డిపార్టుమెంటు కొత్త వ్యవస్థ. దాంతో నిబంధనలనూ పక్కాగా రూపొందించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. సచివాలయాలు తీసుకొచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా అధికారి పోస్టును సృష్టించారు. కానీ దానికి అధికారిని నియమించకుండా డీఎల్‌డీవోలకు, డీఆర్‌డీఏ పీడీలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కాలం గడిపారు. అభివృద్ధి విభాగానికి జాయింట్‌ కలెక్టర్‌ ఉండేవారు. వారు సచివాలయ బాధ్యతలూ చూసుకొనేవారు. కానీ తర్వాత ఆ పోస్టును పట్టించుకోలేదు. పంచాయతీరాజ్‌శాఖలోని ఎండీవోలకు ప్రమోషన్‌ ఇచ్చి డీఎల్‌డీవోలుగా నియమిస్తారు. వారిలో సీనియర్‌ని గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా అధికారిగా నియమించాలి. జిల్లాలో రెండు డివిజన్ల ఇద్దరు డీఎల్‌డీవోలకు సచివాల యాల అదనపు బాధ్యత అప్పగించారు. కానీ సచివాలయాలశాఖ ఏ డిపార్టుమెంటు పరిధో స్పష్టత లేదు. ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం పరిష్కారం చూపే కసరత్తు మొదలెట్టింది.

Updated Date - Aug 29 , 2024 | 07:53 AM

Advertising
Advertising