ఇసుకకు సచివాలయాల అనుమతి తప్పనిసరి
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:34 AM
అనధికార ఇసుక ర్యాంపుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. సోమవారం ప్రముఖ దినపత్రికల్లో ప్రచురి తమైన వార్తా కథనాలపై స్పందించిన అధికారులు స్థానిక సచివాలయంలో అనుమతులు తీసుకోవాలని ఆంక్షలు విధించారు.
పి.గన్నవరం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): అనధికార ఇసుక ర్యాంపుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. సోమవారం ప్రముఖ దినపత్రికల్లో ప్రచురి తమైన వార్తా కథనాలపై స్పందించిన అధికారులు స్థానిక సచివాలయంలో అనుమతులు తీసుకోవాలని ఆంక్షలు విధించారు. అక్రమంలోనైనా ఉచిత ఇసుకను సక్రమంగా లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో అధికారులు పి.గన్నవరం డీఎస్‌పాలెం ర్యాంపుపై దృష్టిచారించారు. లబ్ధిదారులకు అవసరా లు మేరకు ఎంతమేర ఇసుక అవసరమో స్థానిక సచివాలయాల్లో సంబంధిత కార్యదర్శి నుంచి అనుమతులు పొందాలని తహశీల్దార్ పి.శ్రీపల్లవి సూచిం చారు. అనుమతులతో కూడిన పత్రం ఉంటేనే ట్రాక్టర్లను ర్యాంపులోకి అనుమ తించాలని ర్యాంపు నిర్వాహకులు, స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. నిబంధనలు విధించడంతో ర్యాంపు మధ్యాహ్నం నుంచి నిలిచిపోయింది. కాగా మండలంలోని పలు ప్రాంతాల్లో ఇంకా ఇసుక దందా కొనసాగుతూనే ఉంది.
Updated Date - Dec 25 , 2024 | 01:34 AM