ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బడికి పూర్వ విద్యార్థి బహుమానం

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:59 PM

అక్షరాలు దిద్దించి ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాదిగా నిలిచిన బడిని మరిచిపోకుండా రూ.26 లక్షలతో భవనం నిర్మించి బహుమానంగా ఇచ్చారు ఓ ఎన్‌ఆర్‌ఐ.. జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుల లక్ష్మీనరసింహచైనులు 1940-45 మధ్య ఆదుర్రు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు విద్యనభ్యసించారు.

మామిడికుదురు, ఆగస్టు 29: అక్షరాలు దిద్దించి ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాదిగా నిలిచిన బడిని మరిచిపోకుండా రూ.26 లక్షలతో భవనం నిర్మించి బహుమానంగా ఇచ్చారు ఓ ఎన్‌ఆర్‌ఐ.. జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుల లక్ష్మీనరసింహచైనులు 1940-45 మధ్య ఆదుర్రు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తగా ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. తాను చదువుకున్న స్కూల్‌కు ఏదో ఒకటి చేయాలనే తలంపుతో సుమారు రూ.26 లక్షలతో పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. దాతలు ఉపాధ్యాయుల లక్ష్మీనరసింహచైనులు-అన్నపూర్ణ దంపతులను స్థానిక సర్పంచ్‌ శ్రీనివాస్‌, హెచ్‌ఎం పల్లంరాజు తదితరులు అభినందించారు. రెండు గదుల భవన నిర్మాణం పూర్తవడంతో గురువారం దాతల తరపున వారి బంధువులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు భవనాన్ని అప్పగించారు.

Updated Date - Aug 30 , 2024 | 12:00 AM

Advertising
Advertising