విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి
ABN, Publish Date - Sep 22 , 2024 | 12:27 AM
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద అమలాపురం రూరల్ బండారులంక జడ్పీ హైస్కూలులో భోజన పథక ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
అమలాపురం రూరల్, సెప్టెంబరు 21: విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద అమలాపురం రూరల్ బండారులంక జడ్పీ హైస్కూలులో భోజన పథక ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తయారీ ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం భోజన ఏర్పాట్లను కల్పిస్తుందని చెప్పారు. విద్య, భోజనంతో పాటు పాఠశాల నిర్వహణ, వేస్ట్ మేనేజ్‌మెంట్, శానిటేషన్ ఇన్‌ప్రూమెంట్, మంచినీటి సదుపాయం వంటి అంశాలపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సిలబస్ ఏ మేరకు పూర్తి అయిందనే అంశంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Sep 22 , 2024 | 12:28 AM