శృంగారవల్లభస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:08 AM
పెద్దాపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని శనివారం అధికసంఖ్యలో భక్తులు దర్శి ంచుకున్నారు.తెల్లవారుజామునుంచేస్వామి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3,41,360, అన్న దాన విరాళాలు రూ.1,19,324 ఆదాయం, కేశ ఖండన ద్వారా రూ.6,040, తులాభారం, కాను కల ద్వారా రూ.550, లడ్డూ ప్రసాదం విక్ర యం ద్వారా రూ.39,735 వెరసి
పెద్దాపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని శనివారం అధికసంఖ్యలో భక్తులు దర్శి ంచుకున్నారు.తెల్లవారుజామునుంచేస్వామి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3,41,360, అన్న దాన విరాళాలు రూ.1,19,324 ఆదాయం, కేశ ఖండన ద్వారా రూ.6,040, తులాభారం, కాను కల ద్వారా రూ.550, లడ్డూ ప్రసాదం విక్ర యం ద్వారా రూ.39,735 వెరసి రూ. 5,07,009 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు పులిహోర, అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సుమారు 10 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 12:08 AM