ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాడపల్లి ఆలయంలో భక్తుల సందడి

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:07 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం బుధవారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది.

ఆత్రేయపురం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం బుధవారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలను తీసుకువచ్చి స్నపనమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం తిరుప్పావై వేదపారాయణం జరి పారు. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదంలో పాల్గొనానరు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.5,88,625 వచ్చినట్టు ఉపకమీషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వకుళ మాత అన్నదాన భవన నిర్మాణానికి రావులపాలేనికి చెందిన పడాల వీర్రెడ్డి, కృష్ణవేణి దంపతులు రూ.1.16 లక్షలు విరాళం ఇవ్వగా, దాతలకు స్వామివారి చిత్రపటం అందిం చారు. ఏపీపీఎస్సీ సభ్యులు ఎస్‌.సలాంబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దాతలకు స్వామివారి దర్శనంతో పాటు పండితుల వేద ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం అందించారు.

ఇస్కాన్‌ భక్తుల సందడి: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీహరిభక్త హనుమాన్‌ ప్రభూజీ ఆధ్వర్యంలో వందలాది మంది ఇస్కాన్‌ భక్తులు సంకీర్తనలు చేశా రు. ఒంగోలు ఇస్కాన్‌ బృందం ఆధ్వర్యంలో హరేరామ కీర్తనలు అలరించాయి.

Updated Date - Dec 26 , 2024 | 12:07 AM