ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బురదకోటలో పెద్ద పులి

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:39 AM

ప్రత్తిపాడు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీప్రాంతంలో 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. బురదకోట పంచాయతీ పరిధిలోని బాపన్నదొర అటవీప్రాంతంలో లేగదూడపై దాడి చేసి చంపి తినేసింది. అటవీశాఖ అధికారులు సోమవారం పెద్దపులి సంచారంపై గాలింపు

పెద్దపులి అడుగుజాడలు

లేగదూడను చంపి తిన్న పులి

పాదముద్రల గుర్తింపు..

నిర్ధారించిన అటవీ అధికారులు

భయాందోళనలో గిరిజన గ్రామాలు

ప్రత్తిపాడు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీప్రాంతంలో 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. బురదకోట పంచాయతీ పరిధిలోని బాపన్నదొర అటవీప్రాంతంలో లేగదూడపై దాడి చేసి చంపి తినేసింది. అటవీశాఖ అధికారులు సోమవారం పెద్దపులి సంచారంపై గాలింపు జరిపి దాని పాదముద్రలు గుర్తించడంతో పులి రాకను నిర్ధారించారు. బురదకోట చుట్టుపక్కల గిరిజన గ్రామాలను అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు సమాచారం ఇచ్చి సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాల్లో పశువులు, మేకలను అటవీ ప్రాంతంలో మేపడానికి తరలించవద్దని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా అటవీ అధికారి డి.రవీంద్రనాధ్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఫా రెస్ట్‌ రేంజర్‌ కె.దుర్గారాంప్రసాద్‌, డీఆర్వో ఎం. జాన్సన్‌, క్షేత్రస్ధాయి అటవీ సిబ్బంది పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బురదకోట, బాపన్నదొర, కె.మిర్చివాడ, కొండపల్లి, ఉలిగోగుల, అటవీ ప్రాంతంలో 6 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటుచేశారు. బురదకోట కేంద్రంగా రెండున్నర కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్‌ రేంజర్‌ కె.దుర్గారాంప్రసాద్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి ట్రాప్‌ కెమెరాలకు పులి జాడ లభించలేదని చె ప్పారు. పులి సంచరించిన ప్రదేశంలో పాదముద్రలను ల్యాబ్‌కు తరలించి అవి పులి పాదయాద్రలేనని నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ఇది ఇలా ఉంటే బురద కోట అటవీ ప్రాంతంలో పులి సంచరించడం నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాల్లో భయాందోళన నెలకొన్నాయి. పశువులను, గొర్రెలను, మేకలను సమీప అడవుల్లోకి పంపవద్దని, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగాలని, ఒంటరిగా ఎవరూ అటవీప్రాంతంలోకి వెళ్లవద్దని కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.

పులి ఎలా వచ్చింది?

బురద కోట అటవీప్రాంతానికి పులి రాకపై గిరిజనులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాపికొండలు, రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి రాజవొమ్మ ంగి అటవీప్రాంతం గుండా ఏలేశ్వరం అటవీప్రా ంతానికి చొరబడిందని పలువురు చెబుతున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 12:39 AM