జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:01 AM
మండ లంలోని భూపతిపాలెంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం త్వరలో అధికార బృందాన్ని పం పి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. భూపతిపా లెం గురుకుల పాఠశాలను శుక్రవారం టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తో కలిసి ఆమె సందర్శించా రు. ఈ సందర్భంగా నవీన్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గళ్లా రాము జూని యర్ కళాశాల ప్రతిపాద నను కలెక్టర్ దృష్టికి తీసు కెళ్లారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రశాంతి గురుకుల పాఠశాల నిర్వహణ, జూని యర్ కళాశాల ఏర్పాటుకు అనుకూలత, అందుబాటు లో ఉన్న స్థలం తదితర అంశాలపై వారితో చర్చించారు.
భూపతిపాలెంలో త్వరలో అధికారుల బృందం పర్యటన
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
గురుకుల పాఠశాల సందర్శన
గోకవరం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మండ లంలోని భూపతిపాలెంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం త్వరలో అధికార బృందాన్ని పం పి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. భూపతిపా లెం గురుకుల పాఠశాలను శుక్రవారం టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తో కలిసి ఆమె సందర్శించా రు. ఈ సందర్భంగా నవీన్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గళ్లా రాము జూని యర్ కళాశాల ప్రతిపాద నను కలెక్టర్ దృష్టికి తీసు కెళ్లారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రశాంతి గురుకుల పాఠశాల నిర్వహణ, జూని యర్ కళాశాల ఏర్పాటుకు అనుకూలత, అందుబాటు లో ఉన్న స్థలం తదితర అంశాలపై వారితో చర్చించారు. ప్రస్తుతం పాఠశాలలో సుమారు 480మంది విద్యనభ్యసిస్తున్నారని, పాఠశాల సమీ పంలో జూనియర్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందని, దీనిపై ఇప్పటికే మంత్రి లోకేశ్ ను కలిసి వినతిపత్రం అందజేసినట్టు కలెక్టర్‌కు నవీన్ వివరించారు. ఉన్నతాధికారుల బృందం త్వరలో భూపతిపాలెంలో పర్యటించి సంబంధిత నివేదికను ప్రభుత్వానికి అందజేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. అనంతరం పాఠశాల నిర్వహణా తీరును, డార్మెటరీని ఆమె పరిశీలించారు. విద్యుత్ సరఫరాతోపాటు డార్మెట రీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్ రవి, టీడీపీ నాయకులు మంగరౌతు రా ము, అడపా భరత్, అడపా వెంకట్రావు, ఇడుదు ల అర్జున్నరావు, పురంశెట్టి శివాజీ, బదిరెడ్డి అచ్చ న్నదొర, మండిగ గంగాధర్ పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 01:01 AM