ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్తలంకలో ఉరుసు ఉత్సవాలు

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:23 AM

ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని వలీబాబా దర్గా వద్ద ఆదివారం ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాబాకు గంధం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

దర్శించుకుంటున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు

ముమ్మిడివరం, సెప్టెంబరు 15: ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని వలీబాబా దర్గా వద్ద ఆదివారం ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాబాకు గంధం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న బాబా జెండా స్తంభం నుంచి తెప్పలను నెత్తిన పెట్టుకుని వాటిలో చపాతీ, నిమ్మకాయలు, ఖర్జూర, బొబ్బట్లు, దీపం వంటి పదార్థాలు ఉంచి గుర్రంతో నాట్యం చేయిస్తూ బ్యాండు మేళాలతో ఊరేగింపుగా సత్యనారాయణస్వామివారి ఆలయం వద్దకు చేరుకుని తెప్పలను చెరువులో వదిలి పూజలు నిర్వహించారు. రాత్రి గుర్రంపై బాబాను ఊరేగించి గంధం తీసుకునివచ్చి దర్గాకు వెళ్లి అక్కడ బాబాకు సమర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి హిందూ, ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబా దర్గాను దర్శించుకుని వారి మతాచారాల ప్రకారం పూజలు జరిపించారు. ముజావర్‌ ఆలీబాబా, కమిటీ సభ్యులు గేదెల రఘునాథ్‌బాబా, నూకల శివ, గేదెల ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో బాబా దర్గాను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు దర్గాను దర్శించుకుని పూజలు జరిపించారు. దర్గాకు విచ్చేసిన ఎమ్మెల్యే దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దూడల స్వామినాయుడు, గీసాల చంద్రరావు, తోలేటి రాంబాబు, వీపూరి నాగరాజువర్మ, రవివర్మ, గేదెల స్వరూప్‌, తోలేటి గోపి, పిల్లా చిన్నా, విత్తనాల భైరవస్వామి, బద్రి రమ, సామంతకుర్తి సుబ్బారావు, వంగా విజయ్‌, బొక్కా త్రినాథ్‌, కుచ్చర్లపాటి చిట్టిరాజు, పలివెల నాగరాజులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:23 AM

Advertising
Advertising