ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌ చార్జీల పెంపుపై వైసీపీ నిరసన

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:07 AM

విద్యుత్‌ చార్జీల అదనపు భారాలను ప్రజల మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ అన్నారు.

వినతిపత్రం అందజేస్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేణు, మాజీ ఎంపీ భరత్‌ తదితరులు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 27( ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల అదనపు భారాలను ప్రజల మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ అన్నారు. విద్యుత్‌ అదనపు చార్జీలను వ్యతిరేకిస్తూ శుక్రవారం కోటిపల్లి బస్టాండ్‌ నుంచి నిరసన బైక్‌ ర్యాలీ చేశారు. గోదావరి బండ్‌ రోడ్డులోరి ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులకు వినతిపత్రం అంది ంచారు. నిరసనలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, రుడా మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, వైసీపీ నాయకులు గిరిజాలబాబు, గుర్రం గౌత మ్‌, నక్కా శ్రీనగేష్‌, సంకిస భవాని ప్రియ, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి పాల్గొన్నారు.

నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జీఎస్‌ నాయుడు గైర్హాజరు

నిడదవోలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ చార్జీల అదనపు భారాన్ని తగ్గించాలని కోరుతూ శుక్రవారం నిడదవోలులో వైసీపీ ర్యాలీ, ధర్నా నిర్వహించింది.ఈ ఆందోళనకు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు గైర్హాజర య్యారు.పార్టీ పిలుపు ఇచ్చినా ఆయన కార్యక్ర మాల్లో పాల్గొనక పోవడంపై పార్టీ శ్రేణుల్లో ఏవో గుసుగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోని ఒక వర్గం మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు తండ్రి మాజీ ఎమ్మెల్యే జీ.ఎస్‌.రావు అనారోగ్యం తో ఉన్న కారణంగా రాలేకపోయారని చెబుతు న్నారు.అదే పార్టీలోని మరొకవర్గం ఆయన పార్టీ మారే ఆలోచనతోనే కాస్త దూరంగా ఉం టున్నా రని చెప్పుకుంటున్నారు.ఈ కారణంతోనే నియోజ కవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో రాజమండ్రి పార్ల మెంటు ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ పాల్గొంటున్నారనే చర్చ సాగుతోంది. శుక్ర వారం జరిగిన విద్యుత్‌ ధర్నా కూడా ఆయన ఆధ్వర్యం లోనే జరగడం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - Dec 28 , 2024 | 01:07 AM