AP Politics: 2017లో జరిగిన విషయాన్ని బయటపెట్టిన ఎన్నికల వ్యూహకర్త పీకే!.. వైసీపీ నేతలు అంత తహతహలాడారా?
ABN, Publish Date - Mar 08 , 2024 | 04:24 PM
2017లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్ కిశోర్ స్వయంగా వెల్లడించారు. 2017లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని చాలా మంది వైసీపీ నేతలు భావించారని, ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ‘‘ అది 2017 ఆగస్టు అనుకుంటా. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోయాక వైఎస్సార్‌సీపీలోని నేతలు, పార్టీ సానుభూతిపరులు చాలామంది పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు’’ అని పీకే బయటపెట్టారు.
ఎండలు ముదరక ముందే ఎన్నికల వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ (AP Election 2024) హీటెక్కింది. అధికార వైసీపీ (YSRCP), విపక్ష టీడీపీ (TDP)-జనసేన కూటమి వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఒకవైపు రేసు గుర్రాల్లాంటి అభ్యర్థులను అన్వేషిస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులను చిత్తు చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏపీ ఎన్నికల్లో అధికార వైస్సార్‌సీపీ ఓడిపోవడం ఖాయమని, తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే జగన్‌కూ పడుతుందంటూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prasanth Kishore) ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా 2017లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్ కిశోర్ స్వయంగా వెల్లడించారు.
2017లో పవన్ కల్యాణ్‌తో (Pawan kalyan) పొత్తు పెట్టుకోవాలని చాలా మంది వైసీపీ నేతలు భావించారని, ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ‘‘ అది 2017 ఆగస్టు అనుకుంటా. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోయాక వైఎస్సార్‌సీపీలోని నేతలు, పార్టీ సానుభూతిపరులు చాలామంది పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు’’ అని పీకే బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడింది’ అని పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో ప్రశాంత్ కిశోర్ ఎప్పుడు, ఎక్కడ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి
NDA బీజేపీ- టీడీపీ మధ్య మళ్లీ దోస్తి.. ఆరేళ్ల తర్వాత కూటమిలోకి తెలుగుదేశం
Pranav Gopal: అమర్నాథ్‌ను టీఎన్ఎస్ఎఫ్ చీఫ్ అంతమాట అనేశాడేంటి?
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 08 , 2024 | 04:31 PM