Ambati Rayudu: ఇంత క్రేజ్ ధోనీ.. పవన్ కల్యాణ్‌కు మాత్రమే!!
ABN, Publish Date - May 04 , 2024 | 08:38 PM
జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తన ప్రసంగంతో ఇరగదీస్తున్నారు. అటు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) ఆకాశానికెత్తేస్తున్నారు..
బాపట్ల, ఆంధ్రజ్యోతి: జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తన ప్రసంగంతో ఇరగదీస్తున్నారు. అటు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) ఆకాశానికెత్తేస్తున్నారు. శనివారం నాడు బాపట్ల జిల్లా రేపల్లెలో కూటమి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌తో పాటు రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఇంత క్రేజ్ క్రికెటర్ ధోనికి, పవన్ కళ్యాణ్‌కు మాత్రమే చూశానన్నారు. ఈ మాటలు విన్న పక్కనే ఉన్న పవన్ హ్యాపీగా ఫీలయ్యి నవ్వుకున్నారు. కూటమికి ఓటు వేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ ప్రజల కోసం వచ్చారని.. ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పారు. మద్యం, డబ్బు ప్రలోబాలకు లొంగకుండా ఓట్లు వేయాలని నియోజకవర్గ ప్రజలకు రాయుడు సూచించారు. కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నమస్కరించి అంబటి కోరారు. రాయుడు మాట్లాడుతున్నంత సేపూ ఈలలు, కేకలతో అభిమానులు, పార్టీ శ్రేణులు హోరెత్తించారు.
అందుకే మా కూటమి!
ఇక ఇదే సభలో పవన్ ప్రసంగిస్తూ.. వైసీపీ అరాచక ప్రభుత్వంలో అందరూ ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. కనీసం రైతుల సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం ఇదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మనకు డబ్బు అవసరం లేదు ఆత్మగౌరవం చాలు. దశాబ్ద కాలం ఎన్ని ఓటములు ఎదురైనా నిలబడ్డాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ను భ్రష్టు పట్టించారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. కూటమి ప్రభుత్వం రాగానే విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. మూసి వేసిన పాఠశాలలు తెరుస్తాం. మెగా డీఎస్సీ వేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎంతటి దుర్మార్గుడో ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు ఎలా కలిసాయో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలకుండా మేం కల్పిస్తాం’ అని పవన్ చెప్పుకొచ్చారు.
Updated Date - May 04 , 2024 | 08:38 PM