ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: పవన్‌ను పెళ్లాల పేరిట విమర్శించే వైఎస్ జగన్‌కు భారీ షాక్!

ABN, Publish Date - Apr 25 , 2024 | 08:31 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan) పెళ్లాల పేరిట విమర్శించే వైసీపీ అధినేత జగన్‌కు (YS Jagan Mohan Reddy) భారీ షాక్‌ తగిలింది. సొంత పార్టీ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి..

  • మొదటి భార్య కొడుకు వర్సెస్‌ రెండో భార్య కూతురు!

  • ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడికి ఇంటిపోరు

  • ‘మాడుగుల’ ఇండిపెండెంట్‌గా రవి

  • వైసీపీ తరఫున అనూరాధ పోటీ

అనకాపల్లి జిల్లా/మాడుగుల, ఏప్రిల్‌ 24: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan) పెళ్లాల పేరిట విమర్శించే వైసీపీ అధినేత జగన్‌కు (YS Jagan Mohan Reddy) భారీ షాక్‌ తగిలింది. సొంత పార్టీ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి (Budi Mutyala Naidu) ఇద్దరు భార్యల పిల్లలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి దిగారు. అది కూడా ఒకే నియోజకవర్గం మాడుగల నుంచే కావడం విశేషం.

టికెట్.. నామినేషన్ కూడా..!

బూడి మొదటి భార్య కుమారుడు రవి, రెండో భార్య కుమార్తె అనూరాధ ఇక్కడ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ముత్యాల నాయుడు అనకాపల్లి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో 2019లో తాను గెలిచిన మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన.. తన రెండో భార్య కుమార్తె అనూరాధకు టికెట్‌ ఇప్పించుకున్నారు. ప్రస్తుతం కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న అనూరాధ నామినేషన్‌ కూడా వేశారు.


అనుకున్నదొక్కటీ..!

ఇంతలో తెరమీదకు వచ్చిన మొదటి భార్య కుమారుడు రవి ముత్యాలనాయుడి వారసుడినైన తనకు టికెట్‌ ఇవ్వకుండా అనూరాధకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ.. బుధవారం మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అనంతరం, రవి మాట్లాడుతూ.. గతంలో తాను జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నానన్నారు. ఇప్పుడు సమయం వచ్చిందని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. నాయకులు పథకాల ఆశ చూపుతారని, ఓటర్లు మోసపోవద్దని ఆయన సూచించారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఏం కావాలో అది చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు.

Read Latest Andhra Pradesh News And Telugu News


Updated Date - Apr 25 , 2024 | 08:34 AM

Advertising
Advertising