ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు.. పవన్ సంచలన కామెంట్స్

ABN, Publish Date - Apr 01 , 2024 | 06:27 PM

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పిఠాపురంలో చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్.. ‘నన్ను కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు.. అందులో కొందరు కిరాయిమూకలు సన్న బ్లేడ్‌లతో వస్తున్నారు. వారు సన్న బ్లేడ్‌లు తెచ్చి నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారు...

అమరావతి/పిఠాపురం, ఏప్రిల్ 01: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పిఠాపురంలో చేరికల సందర్భంగా సేనాని నోట వచ్చిన మాటలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.

కోస్తున్నారు..!

నన్ను కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు.. అందులో కొందరు కిరాయిమూకలు సన్న బ్లేడ్‌లతో వస్తున్నారు. వారు సన్న బ్లేడ్‌లు తెచ్చి నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారు. మన ప్రత్యర్థి పార్టీ సంగతి తెలుసు కదా..?. ఫొటోల కోసం మూకుమ్మడిగా అభిమానులు వచ్చినప్పుడు కొన్ని ప్రొటోకాల్‌ పద్ధతులు పాటిద్దాం. అందరితో ఫొటోలు దిగాలని నాకూ ఉంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతాను. ప్రతిరోజు 200 మంది కలిసేందుకు అవకాశం ఇస్తాను. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చానుఅని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!


జాగ్రత్త సేనానీ!

ఈ వ్యాఖ్యలతో జనసేన శ్రేణుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. అయితే.. ఇదివరకే ఇలా జరగడంతోనే పవన్ ఇలా మాట్లాడారని ఆయన మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం పిఠాపురంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. ఎందుకైనా మంచిది పవన్ అత్యంత జాగ్రత్తగా ఉండి.. అవసరమైతే సెక్యూరిటీ పెంచుకోవాలని.. లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భద్రత తీసుకుంటే మంచిదని వీరాభిమానులు, కార్యకర్తలు సూచిస్తు్న్నారు.

Updated Date - Apr 01 , 2024 | 06:47 PM

Advertising
Advertising