ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

ABN, Publish Date - Jun 06 , 2024 | 03:36 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. పవన్ విజయంపై మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.


అయితే పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అకీరా తల్లి రేణూ దేశాయ్‌ (Renu Desai) సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.


మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8వ తేదీ లేదా 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన తనయుడు అకీరా నందన్‌‌‌ను త్వరలోనే సినీరంగంలో అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: ఓటమితో నిజం ఒప్పేసుకున్న బొత్స.. నిన్నటి వరకు ఓ మాట.. నేడు మరో మాట..

YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది: వైఎస్ జగన్

Big Breaking: ఇక ఆ తప్పు అస్సలు చేయను.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 06 , 2024 | 03:47 PM

Advertising
Advertising