ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..!

ABN, Publish Date - May 23 , 2024 | 02:11 PM

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు.

అమరావతి, ఆంధ్రజ్యోతి మే-23: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్‌మెన్లు బయటికి పంపించేశారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి.. వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని.. అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్‌మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి కుటుంబ సభ్యులు బయల్దేరారు.


నానికి అసలేమైంది..?

నానికి ఇలా అయ్యిందని తెలుసుకున్న వీరాభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకుంటున్నారు. అసలేం జరుగుతోందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి..? ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా..? లేకుంటే మరేమైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్‌లో ఇదివరకు చికిత్సలు చేయించుకున్నా ఆరోగ్యం సెట్ కావట్లేదని కార్యకర్తలు కంగారుపడుతున్నారు. అయితే ఎందుకిలా జరిగిందో.. నాని లేదా కుటుంబ సభ్యులు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Updated Date - May 23 , 2024 | 02:22 PM

Advertising
Advertising