ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: విశాఖ సిగలో మరో మణిహారం.. వైసీపీ సర్కారుపై గంటా శ్రీనివాస రావు వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - Feb 26 , 2024 | 08:28 PM

రెండు రోజులక్రితం విశాఖపట్నంలో హడావుడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా విరిగిపోవడంతో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ బ్రిడ్జి ముక్కలవుతున్న సమయంలో దానిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ గంటా శ్రీనివాస రావు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ‘విశాఖ సిగలో మరో మణిహారం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విశాఖపట్నం: రెండు రోజులక్రితం విశాఖపట్నంలో హడావుడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా విరిగిపోవడంతో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ బ్రిడ్జి ముక్కలవుతున్న సమయంలో దానిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ గంటా శ్రీనివాస రావు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ‘విశాఖ సిగలో మరో మణిహారం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఆర్కే బీచ్‌లో సముద్రంపై అలా తేలుతూ నడవచ్చు అనుకుంటే ఒక్కరోజుకే తేలి'పోయింది'..!. ఎంతో ఆర్భాటంగా రూ.1.60 లక్షల వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఒక్క రోజు వ్యాలీడితో వారి దృఢత్వ నైపుణ్యం ఏంటో మరోసారి రుజువు చేశారు. ఆనాడు విశాఖ నగరంలో రూ.40 లక్షలు వ్యయంతో నిర్మించిన మోడల్‌ బస్‌షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలింది. ఇప్పుడు ఇలా. మీరు ప్రతిదీ ఇలా కట్టడం అవుతుంది... వెనువెంటనే అది కూలడం కూడా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యింది’’ అని గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు.

‘‘ ఒక చిన్న బస్ షెల్టర్, ఫ్లోటింగ్ బ్రిడ్జినే సక్రమంగా కట్టలేని వాళ్ళు రాజధాని, పోలవరం ప్రాజెక్టులను కట్టేస్తారంటే జనాలు నవ్వుకుంటున్నారు జగన్నన్న. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. మీ ప్రచారాల ప్రభుత్వానికి ఇక సమయం 50 రోజులే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రజలు బై జగన్.. బై బై జగన్ అని చెప్పాల్సిన సమయం వచ్చేసింది’’ అని గంటా శ్రీనివాస్ రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Updated Date - Feb 26 , 2024 | 08:28 PM

Advertising
Advertising