పేర్ని నాని గోదాముల.. రికార్డులు, కంప్యూటర్లు స్వాధీనం
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:05 AM
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికారులు గోడౌన్ కార్యాలయం తాళాలు పగులగొట్టి మరీ రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
తాళాలు పగులగొట్టి తీసుకున్న అధికారులు
వాటి పరిశీలన పూర్తయితే ఎంత బియ్యం మాయమైందో తెలిసే అవకాశం
పేర్ని జయసుధ ముందస్తు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా
అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నో
మచిలీపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికారులు గోడౌన్ కార్యాలయం తాళాలు పగులగొట్టి మరీ రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ తాళా లు, రికార్డులు సకాలంలో ఇవ్వకుండా పేర్ని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వె ళ్లిపోయారు. దాంతో ఈ నెల 15వ తే దీనే న్యాయవాదుల సమక్షంలో అధికారులు గోడౌన్ తాళాలు పగులగొట్టి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో గోడౌన్‌లోని బియ్యాన్ని మచిలీపట్నం ఎంఎల్‌సీ పాయింట్‌కు తరలించారు. అనంతరం తాళాల విషయంలోనూ పేర్నినాని మనుషులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని ఈ గిడ్డంగుల్లో 444.406 టన్నుల పీడీఎస్ బియ్యం ఉండాల్సి ఉండగా, 248.74 టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. సర్కారు ఆదేశాల మేరకు మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి, డీఎస్పీ అబ్దుల్ సుభాన్, తహశీల్దార్ మధుసూధనరావు, పౌరసరఫరాశాఖ అధికారులు బుధవారం రాత్రి అక్కడకు వెళ్లారు. కార్యాలయానికి వేసిన తాళాలను పగులగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. రికార్డుల పరిశీలన, కంప్యూటర్లలో లెక్కలు సరిచూసే పని పూర్తయితే.. గోడౌన్‌ల నుంచి ఎంతమేర బియ్యం మాయమయ్యాయో తేలిపోతుంది. కాగా.. మచిలీపట్నంలో పీడీఎస్ బియ్యం మాయం కేసులో విజయవాడకు చెందిన స్పెషల్ పీపీ, జాయింట్ డైరెక్టర్ విజయను ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు ప్రభుత్వం నియమించింది. ఈ కేసు గురువారం 9వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. సోమవారానికి వాయిదా వేయాలని స్పెషల్ పీపీ కోరగా.. న్యాయాధికారి ఎస్.సుజాత శుక్రవారానికి విచారణను వాయిదా వేశారు. ఈ కేసులో నిందితురాలు, పేర్ని నాని భార్య జయసుధను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న ఆమె తరఫు న్యాయవాదుల అభ్యర్థనను తిరస్కరించారు.
Updated Date - Dec 20 , 2024 | 05:05 AM