Farmers' happiness : రైతుల ఆనందమే టీడీపీ ధ్యేయం
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:12 PM
రైతులు దేశానికి వెన్నెము కలాంటివాడని, రైతు అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తు న్నారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి అన్నారు.
ప్రతి ఎకరాకు నీటిని అందజేస్తా
కొప్పోలు చెరువు నుంచి నీటిని విడుదల చేసిన పుత్తా
వల్లూరు, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): రైతులు దేశానికి వెన్నెము కలాంటివాడని, రైతు అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తు న్నారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి అన్నారు. కొప్పోలు చెరువు నుంచి ఆయకట్టు కాల్వ లకు బుధవారం అధికారులతో కలిసి నీరు విడుదల చేసిన ఆయన మా ట్లాడుతూ చెరువుల్లో నీరు పొలాలకు ఉపయోగపడ తాయన్నారు. ఎన్డీఏ కూట మి అధికారం చేపట్టినప్ప టి నుంచీ సీఎం చంద్రబా బు ఆధ్వర్యంలో ప్రతి ఎక రాకు నీరు అందిస్తామ న్నారు. ఈఈ వెంకట రామయ్య, డీఈ జగదీశ్వ ర్‌రెడ్డి, డీఈ శేషుబా బు, ఏఈ శంకరయ్య, ఎమ్మా ర్వో శ్రీవాణి, టీడీపీ మండ ల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ జయసుబ్బా రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జ్ శ్రీనివాసరెడ్డి, ఓబుల్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, విజయరెడ్డి, ధర్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శివారెడ్డి, బాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
‘రీసర్వేతో రైతులకు అన్నీ కష్టాలే’
కమలాపురం రూరల్, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): వైసీపీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంగా చేసిన రీసర్వేలో రైతులకు అన్నీ కష్టాలే మిగి లాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. బుధవారం దేవరాజుపల్లెలో నిర్వహించిన రీసర్వే సమస్యలను పరిష్క రించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో రైతులను కష్టాల పాలు చేసిందన్నారు. రీసర్వే సమస్యలను రెవెన్యూ సదస్సులు గ్రామసభలో పరిష్కరించాలని అధికారుల దృష్టికి తెచ్చారు. తహసీల్దారు శివరాంరెడ్డి, డిప్యూటీ తహసీ ల్దారు శ్రీకాంత్, వీఆర్వోలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 11:12 PM