వెంకన్న సన్నిధిలో కేశవ్
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:30 AM
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బడ్జెట్
అమరావతి/తుళ్లూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బడ్జెట్ పత్రాలను వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేశవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విధానాలను సృష్టంగా వివరిస్తూనే, గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తిచూపారని కొనియాడారు.
Updated Date - Nov 12 , 2024 | 04:30 AM