ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fishermen : జీవన భృతి చెల్లించండి

ABN, Publish Date - Oct 06 , 2024 | 04:51 AM

మత్స్యకారులు జీవన భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా సమయం దాటిపోయింది. రాష్ట్రంలో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధిస్తాయి.

  • మత్స్యకారుల ఎదురుచూపులు

  • సంక్రాంతికి ఇస్తామంటున్న అచ్చెన్న

  • ఇప్పటికే ఆలస్యమైందంటున్న లబ్ధిదారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మత్స్యకారులు జీవన భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా సమయం దాటిపోయింది. రాష్ట్రంలో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధిస్తాయి. ఆ 61 రోజుల పాటు సముద్ర ఉత్పత్తులను సంరక్షించి, మత్స్యసంపదను కాపాడటానికి వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కొరవడుతుంది. దీంతో వారికి ప్రతి ఏటా సాయం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య వేట నిషేధ సమయంలో ఎన్నికలు జరగడంతో మత్స్యకారులకు జీవన భృతి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు మత్స్యకారులకు నిధులు విడుదల చేయలేదు.

గతంలో టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ కాలానికి జీవన భృతి కింద ఒక్కో మత్స్యకారుడికి రూ.4 వేలు చొప్పున సాయం చేసింది. గత ప్రభుత్వం దీనిని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరుతో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలుకు పెంచింది. టీడీపీ హయాంలో ఏటా 70 వేలమంది దాకా జాలర్లకు లబ్ధి చేకూర్చగా, గత ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో జలాశయాల్లో చేపలు పట్టే వారిని కూడా కలిపి లక్ష మందికి పైగా సాయం చేసింది. ఇలా ఐదేళ్లూ మత్స్యకార భరోసా అమలు చేసింది. గత ప్రభుత్వం జూలైలోగా సాయం చేసేది. అయితే గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా నిష్పక్షపాతంగా ఇవ్వలేదని, చాలా చోట్ల అనర్హులకు ఇచ్చారని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

మత్స్యకారులకు ఇచ్చే పరిహారం, లబ్ధిదారుల ఎంపికపై రీసర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి సంబంధిత అధికారులను జూలై 10న ఆదేశించారు. అయినా లబ్ధిదారుల సర్వే వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్తున్నారు. లబ్ధిదారుల సంఖ్య కుదిస్తారా? పెంచుతారా? అనేది అధికారులు ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ ఏడాది వేట నిషేధ భృతి ఎప్పుడిస్తారో తెలియక మత్స్యకార కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇస్తామని అచ్చెన్న ఇటీవల శ్రీకాకుళంలో ప్రకటించారు. అయితే, జీవన భృతి చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమైందని, వెంటనే చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2024 | 04:51 AM