ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసెంబ్లీకి వచ్చిన సునీతారెడ్డి

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:39 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.

వివేకా కేసుపై సీఎంవోలో ఆరా

హోం మంత్రి అనితతో భేటీ

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబు లేకపోవడంతో సీఎంవో అధికారులతో తన తండ్రి హత్య కేసు విచారణ పురోగతిపై చర్చించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆమె కోరినట్లు తెలిసింది. అలాగే ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేయాలని కూడా అభ్యర్థించినట్లు సమాచారం. అంతకుముందు హోం మంత్రి అనితతో సునీత సమావేశమయ్యారు. సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌పై వేసిన ప్రైవేటు కేసులో కడప పోలీసులు ఇటీవల వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ కేసు విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన సునీతను చూసిన కొందరు ఎమ్మెల్యేలు.. ‘అన్న ఎమ్మెల్యేగా గెలిచి ప్యాలె్‌సలో కూర్చున్నాడు.. చెల్లెలు ప్రజాప్రతినిధి కాకపోయినా అసెంబ్లీకి వచ్చారు’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:39 AM