Funds : సీమ అభివృద్ధికీ నిధులు సాధించాలి
ABN, Publish Date - Sep 29 , 2024 | 11:27 PM
కూటమి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసమే కాకుండా రాయలసీమ అభివృద్ధికి కూడా కేంద్రంతో పోరాడి నిధులు సాఽధించి సీమకు బాసటగా నిలబడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్య క్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి డిమాండ్ చేశా రు.
రాష్ట్ర మహాసభల్లో బొజ్జా దశరధరామిరెడ్డి
ప్రొద్దుటూరు, సెప్టెంబరు 29: కూటమి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసమే కాకుండా రాయలసీమ అభివృద్ధికి కూడా కేంద్రంతో పోరాడి నిధులు సాఽధించి సీమకు బాసటగా నిలబడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్య క్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి డిమాండ్ చేశా రు. స్థానిక మున్సిపల్ హైస్కూలులోని మహి ళా శక్తి భవన్‌లో ఆదివారం రాయలసీమ విద్యావంతుల వేదిక రాష్ట్ర మహా సభలు విజ యవంతంగా ముగిశాయి. ప్రారంభోపన్యాసం చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 44 శాతం భూములకు నీటి ప్రాజెక్టులు వుంటే రాయలసీమలో కేవలం 9 శాతం భూములకు మాత్రమే ప్రాజెక్టులు కట్టారన్నారు. ఈ ఒక్కఅంశం తోనే రాయలసీమ పట్ల ఎంత వివక్ష వుందో తేటతెల్ల మౌతుందన్నారు. చంద్రబాబుకు అమరావతి, పోలవ రం మీద వున్న పట్టుదల రాయలసీమ ప్రాజెక్టు మీద కూడా వుండాలన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు సీమ ఉద్యమాన్ని బలపరచాలని పిలుపు నిచ్చారు. అనంతపురం నేత రామాంజనేయులు మా ట్లాడుతూ రాయసీమ పౌరుషాన్ని ఇక్కడ జరుగుతు న్న నీళ్ళ దోపిడీని ప్రశ్నించడంలో చూపాలని సీమ ప్రజాప్రతినిధులకు సూచించారు.
మొదటి సెషన్‌లో విభజన హామీలు అమలు తీరుపై డాక్టర్ అప్పిరెడ్డి హరినాధరెడ్డి మాట్లాడుతూ నిజమైన మానవతా ఉద్య మం ఏదైనా వుందంటే అది రాయలసీమ నీళ్ళ ఉద్య మమన్నారు. విభజన చట్టంలో రాయలసీమ కు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ సెయిల్ ఆధ్వ ర్యంలోని ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడ కుండా పాలక వర్గాలు వారి ప్రయోజనాల కోసం చేసిన ప్రత్యేక హోదా ఉద్యమంలో సీమ ప్రజలు కొట్టుకు పోయారన్నారు. రెండో సెషన్‌లో ‘పదేళ్ళ రాయలసీమ ఉద్యమం కర్తవ్యాలు’ అంశంపై ఎస్ రవికుమార్ మాట్లా డుతూ విభజనానంతరం రాయలసీమ పదే ళ్ళలో గతంలో ఎన్నడూ చేయన్నంత విస్తృతం గా పలు డిమాండ్లపై ఉద్యమాలు జరిగాయి. అయితే ఈ ఉద్యమాలన్నీ చాలా వరకు దారి తప్పాయన్నారు. ఈసభల్లో రాయలసీమ కళా కారులు యక్షగానం ప్రదర్శించారు. సీమ సమస్యలపై పాటలు పాడారు కార్యక్రమంలో వేదిక రాష్ట్ర కోకన్వీనర్ భాస్కర్‌రెడ్డి, అనంతపురం కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, కర్నూలు కన్వీనర్ రత్నం ఏసోపు, కడప కన్వీనర్ మహమూద్, పాణి, వరలక్ష్మీ, పద్మ, లక్ష్మీదేవి, పల్లవోలు రమణ, శ్రీనివాసులరెడ్డి, హరిత, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పాల్గొన్నారు. అనంతపురం ర్యాలీ శివాలయం సర్కిల్ వరకు చేపట్టారు.
Updated Date - Sep 29 , 2024 | 11:28 PM