ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanayudu: బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం

ABN, Publish Date - Sep 06 , 2024 | 07:26 AM

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. విజయవాడ సింగ్ నగర్‌ను ముంపునకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు నిర్వహిస్తున్నారు.

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. విజయవాడ సింగ్ నగర్‌ను ముంపునకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు నిర్వహిస్తున్నారు. గత 5 రోజుల నుంచి అక్కడే ఉండి ఏజెన్సీలతో పనులు చేయిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రి, నారాలోకేష్‌లకు మంత్రి నిమ్మల రామానాయుడు అప్డేట్ చేస్తున్నారు. బుడమేరు గండ్ల పూడికలో ముందడుగు వేశామన్నారు. ఈ తెల్లవారు జామున 3:30 గంటలకు రెండో గండి పూడిక పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


గత ఐదు రోజుల నుంచి గట్టు పైనే ఉండి నిద్రాహారాలు మాని దగ్గరుండి పనులు చేయిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు గంట గంటకు వర్క్ అప్డేట్ చేస్తూ వారి సూచనలు, సహకారంతో ముందుకు సాగుతున్నామని నిమ్మల వెల్లడించారు. సింగ్ నగర్‌కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామన్నారు. రెండో గండి పూడ్చి కీలకమైన మూడో గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేస్తున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ రోజు మూడో గండిని సైతం పూడ్చి సింగ్ నగర్‌కు వరద ముంపుని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గండ్ల ను పూడ్చడంలో మిలిటరీ సైతం సహకరిస్తోందని వెల్లడించారు.


బుడమేరు మూడో గండిని అధికార యంత్రాంగం పూడుస్తోంది. జోరు వానలోనూ వెనుకడుగు వేయకుండా అక్కడే ఉండి రెండు రోజులుగా పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. మూడో గండి కూడా పూడ్చే వరకూ అక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని ఆయన చెబుతున్నారు. మూడో గండిని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో పనులు చేయిస్తున్నారు. గండి పడిన ప్రాంతానికి ఆర్మీ సైతం ఇప్పటికే చేరుకుంది. ఆర్మీ అధికారులు సహాయ సహకారాలతో పనుల్లో వేగాన్ని మరింత పెంచినట్టు నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

Updated Date - Sep 06 , 2024 | 07:26 AM

Advertising
Advertising