Tirumala News: తిరుమలలో ‘బంగారు’ బాబు.. అవాక్కైన జనాలు..!
ABN, Publish Date - Mar 15 , 2024 | 11:09 AM
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశుడి వద్ద లెక్కలేనంత బంగారు రాశులు, ధన రాశులు ఉన్నాయి. అందుకే ఆయన్ను అత్యంత సంపన్న దేవుడుగా భక్తులు కొలుస్తారు. వజ్ర, వైఢూర్యాలతో నిండు అలంకరణతో సుందరరూపుడై భక్తులకు దర్శనిస్తుంటాడు శ్రీవారు. అలాంటి శ్రీవారి సన్నిధిలో ఒంటినిండా దగదగ మెరిసే బంగారు నగలు ధరించి.. అందరినీ విస్తుపోయేలా చేశాడు ఓ భక్తుడు.
తిరుమల, మార్చి 15: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశుడి వద్ద లెక్కలేనంత బంగారు రాశులు, ధన రాశులు ఉన్నాయి. అందుకే ఆయన్ను అత్యంత సంపన్న దేవుడుగా భక్తులు కొలుస్తారు. వజ్ర, వైఢూర్యాలతో నిండు అలంకరణతో సుందరరూపుడై భక్తులకు దర్శనిస్తుంటాడు శ్రీవారు. అలాంటి శ్రీవారి సన్నిధిలో ఒంటినిండా దగదగ మెరిసే బంగారు నగలు ధరించి.. అందరినీ విస్తుపోయేలా చేశాడు ఓ భక్తుడు. ఒంటినిండా బంగారు నగలు ధరించిన ఓ వ్యక్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఒంటిపై పది కిలోల బంగారంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన బంగారు బాబు.. అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్(బంగారు బాబు) గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనను భక్తులు ఆసక్తిగా చూశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 15 , 2024 | 12:23 PM