ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : పవన్‌కు ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌

ABN, Publish Date - Jun 18 , 2024 | 06:30 AM

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంగా ఇరిగేషన్‌ గెస్ట్‌హౌ్‌సను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్‌ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు

డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసుకు విశాల ప్రాంగణం

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంగా ఇరిగేషన్‌ గెస్ట్‌హౌ్‌సను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్‌ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు. తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ గెస్ట్‌హౌ్‌సను కేటాయించారు. అలాగే, సచివాలయంలో గతంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్‌లో ఉండేది.

ఇప్పుడు పవన్‌తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గే్‌షకు కూడా రెండో బ్లాక్‌లో మొదటి అంతస్తులో కేటాయించారు. ఇప్పటికే ఈ బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేషీని మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్‌ వద్ద ఉండటంతో, పవన్‌ పేషీలు రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి పండగలోనూ గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుందని పవన్‌ అన్నారు. ఇస్లాంమతంలో విశ్వాసం ఉన్నవారు రంజాన్‌ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారో బక్రీద్‌ పండుగను కూడా అంతే నిష్టతో చేసుకొంటారని గుర్తుచేశారు. ప్రవక్త మహ్మద్‌ త్యాగనిరతిని స్మరించుకుంటూ నిర్వహించుకునే పండుగ ముస్లింలందరికీ భగవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షించారు

Updated Date - Jun 18 , 2024 | 06:56 AM

Advertising
Advertising