Nara Lokesh: నాడు - నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:19 AM
నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ అవసముందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్స్ అన్నింటిలో ఉపాధ్యాయులు ఉంటారన్నారు.
అమరావతి: నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ అవసముందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్స్ అన్నింటిలో ఉపాధ్యాయులు ఉంటారన్నారు. 117 జీవోపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిన అంశంపై కూడా విచారణ చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.
నాడు - నేడు కార్యక్రమంలో పాఠశాలల ఆధునికీకరణపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ప్రశ్న అడిగారు. అనేక పాఠశాలల్లో నాసిరకం పనులు చేశారని.. అనేక పనుల్లో అవకతవకలు జరిగాయని బహిరంగంగానే చెప్పారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పీ గన్నవరం పాఠశాలలో చేపట్టిన పనుల్లోనే అవకతవకలు జరిగాయన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ స్వయంగా చెప్పారన్నారు. నాడు నేడు పనుల్లో దోపిడీ జరిగిందని.. గుంటూరు జిల్లాలో నిధులు ఇవ్వకుండా పనులు చేపట్టారన్నారు.
సరైన ప్లే గ్రౌండ్స్ స్కూళ్లో లేవని.. ఉన్న పిల్లలకి సరైన సౌకర్యాలు లేవని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రజలే ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టీ, లోకేష్‌తో అరకు కాఫీ తాగితే కూడా కొంతమంది పాఠశాలలకు నిధులు వస్తాయంటున్నారని.. వెంటనే ఆ కార్యక్రమం చేపట్టాలన్నారు. నాడు- నేడు పథకంలో పాఠశాలల్లో పనులు చేయకుండా బిల్లులు డ్రా చేశారని ధూళిపాళ నరేంద్ర అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలన్నారు. పేద పిల్లలు చదువుకునే స్కూళ్లలో పనుల్లో కూడా కక్కుర్తి కి పాల్పడ్డారని ఏలూరి సాంబ శివరావు అన్నారు. దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ.. నాడు - నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని.. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలన్నింటిలో ఉపాధ్యాయులు ఉంటారని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
Hyderabad: స్మిత సబర్వాల్ పోస్ట్ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 23 , 2024 | 11:46 AM