Guinness : గిన్నిస్ బుక్ లక్ష్యం
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:35 PM
గిన్ని స్ బుక్‌లో పేరు సంపాదించాలన్న లక్ష్యంతో ఓ యువకుడు దేశ విదేశాలకు చెందిన అనేక నాణేలను సేకరిస్తున్నాడు. రైల్వేకోడూరు వాసి వసీమాఅస్లాం బీటెక్ చదివాడు. తండ్రి నడుపుతున్న హోటల్‌లో చేదోడువాదోడుగా ఉంటూనే వివిధ దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, మెడల్స్ తదితరాలను సేకరిస్తున్నాడు.
నాణేలు సేకరణలో వసీమా అస్లాం
ఇప్పటికే 30 దేశాల నాణేలు, నోట్లు, మెడల్స్ సేకరణ
రైల్వేకోడూరు, అక్టోబరు20(ఆంధ్రజ్యోతి): గిన్ని స్ బుక్‌లో పేరు సంపాదించాలన్న లక్ష్యంతో ఓ యువకుడు దేశ విదేశాలకు చెందిన అనేక నాణేలను సేకరిస్తున్నాడు. రైల్వేకోడూరు వాసి వసీమాఅస్లాం బీటెక్ చదివాడు. తండ్రి నడుపుతున్న హోటల్‌లో చేదోడువాదోడుగా ఉంటూనే వివిధ దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, మెడల్స్ తదితరాలను సేకరిస్తున్నాడు. క్రీస్తు పూర్వం 200, 300 ఏళ్ల నాటి నాణేలు, మౌర్యులు, శాతవాహనులు, చోళులు, మట్లిరాజులు, నిజాం నవాబులు, ఢిల్లీ సుల్తాన్ కాలంలో చలామణిలో ఉన్న నాణేలు, ఇండియా, దుబాయ్, కువైట్, కత్తర్, సౌదీ, బెహరిన్, పాకిస్తాన్, కెనడా, సింగపూర్, శ్రీలంక, బంగ్లాదే శ్, ఇంగ్లాండ్, లండన్, రష్యా, చైనా, యూరప్ తదితర దేశాల్లో వివిధ కాలాల్లో చలామణిలో ఉన్న నాణే లు, కరెన్సీ, ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఇచ్చిన పతకాలు సేకరించాడు. ఇప్పటి వరకూ 75,250 నాణేలు సేకరించినట్లు ఆయన చెబుతున్నాడు. వీటితో పాటు కొలంబియాలో పాతకాలం నాటి గ్రామ్‌ఫోన్ రికార్డులు, పెన్నులు తదితరాలను కూడా సేకరించాడు. చిన్నతనం నుంచే నాణేలు తదితరాల సేకరణ అలవాటుగా మార్చుకున్న అస్లాం వద్ద ప్రస్తు తం భారతదేశాని కి చెందిన నాణేలు, స్వాత్యంత్రం నాటి నుంచి మనుగడలో ఉన్న ఉన్న నాణేలు కూడా ఉన్నాయి. సేకరించిన నాణేలు, కరెన్సీ తదితరాలను పలు ప్రాంతా ల్లో, ప్రదర్శిస్తూ చరిత్రపై అవగాహన కల్పిస్తున్నాడు.
Updated Date - Oct 20 , 2024 | 10:35 PM